ఈసారి మేకోవర్ తో వస్తున్నాడు

రీసెంట్ గా ప్రారంభమైంది అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ సినిమా. ఈ సినిమా ఓపెనింగ్ కు నాగార్జున స్పెషల్ గెస్ట్ గా వచ్చినప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం అఖిల్ అనే చెప్పాలి. ఎందుకంటే అఖిల్ రెగ్యులర్ గా కనిపించలేదు. సరికొత్త మేకోవర్ వచ్చాడు.

అవును.. తన రెగ్యులర్ హెయిర్ స్టయిల్, మీసకట్టును పక్కనపెట్టాడు అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ సినిమా కోసం మేకోవర్ అయ్యాడు. జుట్టు బాగా పెంచాడు. సినిమాకు ఈ మేకోవర్ ప్రత్యేకంగా నిలుస్తుందని భావిస్తున్నారంతా. తన సినిమా కోసం అఖిల్ ఇలా మేకోవర్ అవ్వడం ఇదే ఫస్ట్ టైమ్. ఇప్పటి వరకు చేసిన 3 సినిమాల్లో అఖిల్ ఎప్పుడూ కొత్తగా కనిపించలేదు.

గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పకుడిగా రానున్న ఈ సినిమాను వీలైనంత తక్కువ బడ్జెట్ లో పూర్తిచేయాలని నిర్ణయించారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు.