పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మధ్య ప్రస్తుతం అభిప్రాయభేదాలు వచ్చాయట. బన్నీ చెప్పిన మాట త్రివిక్రమ్ వినట్లేదట. డైరక్టర్ చెప్పిన సీన్ బన్నీ చేయడం లేదట. సినిమా కథ పరంగా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలున్నాయని, అందుకే సెకెండ్ షెడ్యూల్ కు కూడా బన్నీ హాజరుకాలేదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ పుకార్లకు మెగా కాంపౌండ్ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది.

ఈ నెలాఖరు నుంచి త్రివిక్రమ్ సినిమా సెకెండ్ షెడ్యూల్ లో బన్నీ పాల్గొంటాడంటూ కాంపౌండ్ నుంచి ఓ ఫీలర్ వచ్చేసింది. తద్వారా బన్నీ-త్రివిక్రమ్ మధ్య ఏమీ జరగలేదని, సినిమా ఆగిపోలేదని చెప్పే ప్రయత్నం చేసింది కాంపౌండ్. ప్రస్తుతం కుటుంబంతో కలిసి బన్నీ విహాయ యాత్రలో ఉన్నాడని, ఈ నెలాఖరుకు ఇండియా తిరిగొచ్చిన వెంటనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు.

ఓవైపు కాంపౌండ్ నుంచి ఇలాంటి ప్రకటనలు వస్తున్నప్పటికీ పుకార్లు మాత్రం ఆగడం లేదు. నిప్పులేనిదే పొగరాదంటారు కదా, అది ఇదేనేమో. అన్నట్టు ఈ పుకార్లను డైవక్ట్ చేయడం కోసం.. ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా కేతిక శర్మను తీసుకున్నట్టు ఘనంగా ప్రకటించింది యూనిట్. అయినప్పటికీ పుకార్లు మాత్రం ఆగడం లేదు.