సైలెంట్ గా సైలెన్స్…..

చాలా రోజులు ఖాళీ గా ఉన్న అనుష్క ఎట్టకేలకు ఒక కొత్త చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే భాగమతి సినిమా తో విజయం సాధించిన అనుష్క, ఆ విజయ పరంపర ని తన కొత్త చిత్రంతో కొనసాగించాలనే కోరిక తో ఉంది.

అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే, ఈ కొత్త చిత్రానికి సైలెన్స్ అనే పేరు ని ఖరారు చేశారు. పేరు కి తగ్గట్టు గా నే ఈ కొత్త చిత్రం లో నటులు అంతా సైలెంట్ గా నే ఉంటారట.

సినిమా లో ఎవరికీ డైలాగ్స్ ఉండవు అనే విషయం ఇప్పటికే చిత్ర యూనిట్ ఖరారు చేసింది. చాలా రోజుల తర్వాత ఫైనల్ గా అమెరికా లో నేడు ఈ సినిమా షూటింగ్ మొదలు అయింది.

హేమంత్ మధుకర్ ఈ సినిమా కి దర్శకుడి గా పరిచయం అవుతున్నాడు. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, మాధవన్ మరియు తదితరులు ఈ సినిమా లో నటిస్తున్నారు. కోన వెంకట్ ఈ సినిమా ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నాడు.