Telugu Global
NEWS

రికార్డు సృష్టించిన వైసీపీ ఎంపీ

సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోని 25 స్థానాలకు గాను 22 ఎంపీలను గెలుచుకొని వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో వైసీపీ ఎంపీ ఒకరు అరుదైన రికార్డు సృష్టించారు. అరకు పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించిన గొడ్డేటి మాధవి లోక్‌సభకు ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అమె వయసు ప్రస్తుతం 25 ఏండ్ల 3 నెలలు మాత్రమే. గతంలో ఈ రికార్డు దుశ్యంత్ చౌతాలా పేరు మీద ఉండేది. […]

రికార్డు సృష్టించిన వైసీపీ ఎంపీ
X

సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోని 25 స్థానాలకు గాను 22 ఎంపీలను గెలుచుకొని వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో వైసీపీ ఎంపీ ఒకరు అరుదైన రికార్డు సృష్టించారు.

అరకు పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించిన గొడ్డేటి మాధవి లోక్‌సభకు ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అమె వయసు ప్రస్తుతం 25 ఏండ్ల 3 నెలలు మాత్రమే. గతంలో ఈ రికార్డు దుశ్యంత్ చౌతాలా పేరు మీద ఉండేది. 2014 ఎన్నికల్లో ఈయన హిస్సార్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటికి అతని వయసు 26 ఏండ్ల 13 రోజులు.

ఇక అరకు నుంచి విజయం సాధించిన గొట్టేటి మాధవి.. సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేవుడు కుమార్తె. పీటీ టీచర్‌గా పని చేస్తున్న ఆమె రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు.

ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ…. గత అనుభావాల దృష్ట్యా తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను ఉపాధ్యాయురాలిగా ఉన్నప్పుడు ఒక విద్యార్థినికి అస్వస్థతగా ఉంటే పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాను. కాని వైద్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు చికిత్స అందించలేదు. ఐటీడీఏ పీవోకు పిర్యాదు చేసిన తర్వాతే వైద్యం లభించింది. దీంతో నాన్న లాగ తాను కూడా ప్రజాప్రతినిధిని అయితే బాగుంటుందని అప్పుడే నిర్ణయించుకున్నానని చెప్పారు.

First Published:  25 May 2019 12:54 AM GMT
Next Story