సీతలు ఇద్దరూ….. ఫెయిల్ అయ్యారు

నిన్న బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. ఒకటి కాజల్ అగర్వాల్ నటించిన సీత కాగా మరొకటి అంజలి నటించిన లిసా.

అంజలికి తెలుగు లో మొదటగా విజయం సాధించిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా లో వేసిన సీత పాత్ర కి అంజలి కి బాగా పేరొచ్చింది. అప్పటి నుండి తెలుగు ప్రేక్షకులకి అంజలి సీత గానే పాపులయర్ అయ్యింది.

అయితే అనూహ్యం గా ఈ ఇద్దరు సీతలు తమ తమ చిత్రాల తో ప్రేక్షకులని ఇంప్రెస్ చేయలేకపోయారు.

తేజ దర్శకుడి గా, కాజల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో వచ్చిన సీత సినిమా లో కొత్తదనం ఏమి లేదు అనిపించింది. కేవలం కాజల్ పాత్ర మరియు నటన కోసం ఈ సినిమా వర్క్ అవుతుంది కానీ అలరించే విధం గా సినిమా లేదు అని వీక్షకులు, సమీక్షకులు తేల్చేశారు.

మరో వైపు అంజలి చేసిన సినిమా ‘లిసా’ హారర్ జానర్ లో రాగా మేకర్స్ అనవసరంగా 3డి ఎఫెక్ట్స్ యాడ్ చేశారు. అవసరమే లేని చోట ఈ ఎఫెక్ట్స్ ఎందుకు అని జనాలు తెగ తిట్టుకుంటున్నారు. ఆ విధం గా ఇద్దరు సీతలు జనాలని ఇంప్రెస్ చేయడం లో విఫలమయ్యారు.