Telugu Global
NEWS

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలి

నందమూరి కుటుంబాన్ని, తెలుగుదేశం పార్టీని విడదీసి చూడలేం. మరీ ముఖ్యంగా ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను టీడీపీని కూడా విడదీసి చూడలేం. ఎన్టీఆర్ పార్టీకి ఎంత దూరంగా ఉండాలని భావిస్తున్నప్పటికీ అతడి అభిమానులు మాత్రం ఊరుకోవడం లేదు. టీడీపీని నిలబెట్టే ఏకైక వారసుడు ఎన్టీఆర్ మాత్రమే అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి వైసీపీ ఎమ్మెల్యే కూడా చేరారు. వైసీపీ పార్టీ తరఫున నిలబడి రికార్డు మెజారిటీతో గెలిచిన కొడాలి […]

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలి
X

నందమూరి కుటుంబాన్ని, తెలుగుదేశం పార్టీని విడదీసి చూడలేం. మరీ ముఖ్యంగా ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను టీడీపీని కూడా విడదీసి చూడలేం. ఎన్టీఆర్ పార్టీకి ఎంత దూరంగా ఉండాలని భావిస్తున్నప్పటికీ అతడి అభిమానులు మాత్రం ఊరుకోవడం లేదు. టీడీపీని నిలబెట్టే ఏకైక వారసుడు ఎన్టీఆర్ మాత్రమే అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి వైసీపీ ఎమ్మెల్యే కూడా చేరారు.

వైసీపీ పార్టీ తరఫున నిలబడి రికార్డు మెజారిటీతో గెలిచిన కొడాలి నాని సంచలన ప్రకటన చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే టైమ్ వచ్చిందన్నారు నాని. మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే గెలిచి పరువు పోగొట్టుకుంది తెలుగుదేశం పార్టీ. మరోవైపు చంద్రబాబుకు వయసు అయిపోతోంది. ఇలాంటి టైమ్ లో పార్టీని నిలబెట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటున్నారు నాని.

గతంలో ఎన్టీఆర్ నటించిన సాంబా సినిమాకు ఇతడే ప్రొడ్యూసర్. వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ చనువుతోనే జూనియర్ ఎన్టీఆర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు నాని. ప్రస్తుతం 30ల్లో ఉన్న ఎన్టీఆర్ కు సినిమాల్లో మంచి కెరీర్ ఉందని, అది పూర్తయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తే బెటరని అన్నారు. అయితే పార్టీని చంద్రబాబు లేదా లోకేష్ లీడ్ చేస్తే మాత్రం 2024 ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అయిపోతుందన్నారు. కాబట్టి ఎన్టీఆర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు నాని.

నాని ప్రకటనతో మరోసారి రాజకీయ ముఖచిత్రం పైకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఇప్పటికే పార్టీని నందమూరి కుటుంబానికి దూరం చేశారంటూ చంద్రబాబుపై విమర్శలు చెలరేగుతున్నాయి. నాని ప్రకటనతో ఈ విమర్శలు మరింత పెరిగే ఆస్కారం ఉంది.

First Published:  25 May 2019 12:45 PM GMT
Next Story