‘కౌసల్య కృష్ణమూర్తి’…. మరో క్రికెట్ బ్యాక్ డ్రాప్

రీమేక్ సినిమాలు తీయడం లో దిట్ట అని పేరు సంపాదించుకున్న భీమనేని శ్రీనివాస్ రావు తాజాగా ఒక కొత్త రీమేక్ కథ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

తమిళం లో ‘కనా’ అనే చిత్రం పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా ని ఇప్పుడు తెలుగు లో ‘కౌసల్య కృష్ణమూర్తి’ పేరు తో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాకి క్రికెట్ బ్యాక్ డ్రాప్ గా ఉండగా రాజేంద్ర ప్రసాద్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

తమిళం లో పలు అవార్డు విన్నింగ్ సినిమాల్లో నటించిన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు లో ఐశ్వర్య రాజేష్ కి రెండో సినిమా. మొదటిది విజయ్ దేవరకొండ సరసన కాగా ఆ సినిమా ఇంకా షూటింగ్ దశ లో ఉంది. ఐశ్వర్య ఈ సినిమా లో క్రికెటర్ పాత్ర లో మెరవనుంది.

తమిళం లో కోచ్ పాత్ర లో సత్యరాజ్ నటించగా ఈ పాత్ర ని తెలుగు లో ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ చేస్తున్నారు. ఆసక్తికరం అంశం ఏంటి అంటే ఈ సినిమా లో తమిళ హీరో శివ కార్తికేయన్ ఒక కీలక పాత్ర లో చేయనున్నాడట. తమిళం లో కూడా ఈ పాత్ర శివ నే చేశాడట.

అందుకే తెలుగు లో కూడా ఆయననే సంప్రదించారు దర్శక నిర్మాతలు. ఇది తెలుగు లో ఆయనకి మొదటి సినిమా కావడం విశేషం.