రణరంగంలో శర్వానంద్

ఎట్టకేలకు శర్వానంద్ సినిమాకు టైటిల్ దొరికింది. కేవలం టైటిల్ దొరకలేదనే కారణంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇప్పటివరకు విడుదల చేయలేదు. చివరికి శర్వానంద్ పుట్టినరోజు నాడు కూడా ఎలాంటి హంగామా చేయలేకపోయారు. అలా చాన్నాళ్లుగా చీకటిలో ఉండిపోయిన ఈ సినిమాకు ఎట్టకేలకు వెలుగొచ్చింది. శర్వానంద్ సినిమాకు రణరంగం అనే టైటిల్ పెట్టారు.

నిజానికి ఈ సినిమాకు దళపతి అనే పేరు పెడదామనుకున్నారు. కానీ అప్పటికే మరో చిన్న నిర్మాణ సంస్థ ఆ టైటిల్ ను రిజిస్టర్ చేయించుకుంది. ఆ సంస్థతో సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మాతలు చర్చలు కూడా జరిపారు. కానీ అవి సత్ఫలితాల్ని ఇవ్వలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండో ఆప్షన్ గా పెట్టుకున్న రణరంగం అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారు.

#RANARANGAM – Aug 2nd, 2019

Posted by Sharwanand on Saturday, 25 May 2019

సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు శర్వానంద్. ఒక పాత్రలో వయసుమళ్లిన డాన్ పాత్ర పోషిస్తున్నాడు. యంగ్ గెటప్ లో 80ల బ్యాక్ డ్రాప్ తో ఉన్న లుక్ ను ఈరోజు విడుదల చేశారు. పనిలోపనిగా ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. ఆగస్ట్ 2న థియేటర్లలోకి రానుంది రణరంగం.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించాడు. కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. సుధీర్ వర్మ దర్శకుడు.

Ranarangam First Look | Sharwanand, Kajal Aggarwal, Kalyani Priyadarshan | Sudheer Varma | #Sharwa27

A tale of a Man who grew to become an Empire himself, #RanarangamFirstLook – https://youtu.be/XEGGbRe13SYDirector Sudheer Varma Kajal Aggarwal Kalyani Priyadarshan #NagaVamsiS #DivakarMani Prashant Pillai Aditya Music

Posted by Sharwanand on Saturday, 25 May 2019