వర్మకు…. చంద్రబాబు ఇలా దొరికిపోయాడు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చంద్ర బాబు నాయుడు ఊహించినదానికంటే భిన్నం గా రావడం తో ఆయన చాలా నిరుత్సాహంతో ఉన్నాడు. ఇప్పటికే గత కొద్దీ రోజులు గా ఎలక్షన్ కమీషన్ మీద విరుచుకు పడుతూ వచ్చిన బాబు ఇప్పుడు కేవలం 23 సీట్లు రావడం తో ఏం చేయాలో కూడా తోచని స్థితి కి వచ్చారు.

ఏళ్ళ నాటి పార్టీ ఒకేసారి ఇలా చతికిల పడడం అంటే మామూలు విషయం కాదు. ఈ దశ లో బాబు కుంగిపోవడం సహజం.

అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం బాబుని టైం చూసి…. పుండు మీద కారం జల్లినట్లుగా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల సమయం లో బాబు…. వర్మ ని ఒక రేంజ్ లో టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు రివెంజ్ తీర్చుకొనే సమయం రావడం తో వర్మ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. “ఏ ప్రదేశం లో అయితే మాజీ సీఎం నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ నుంచి వెళ్లగొట్టారో, ఇప్పుడు సరిగ్గా అదే పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఆదివారం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను. బస్తి మే సవాల్ !!!” అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.