Telugu Global
NEWS

2019 ఫ్రెంచ్ ఓపెన్ హాట్ ఫేవరెట్ సిమోనా హాలెప్

అరుదైన రికార్డుకు హాలెప్ తహతహ డిఫెండింగ్ చాంపియన్ గా టైటిల్ ఫైట్ ప్రపంచ మహిళా టెన్నిస్ మాజీ నంబర్ వన్ , రుమేనియన్ టెన్నిస్ క్వీన్ సిమోనా హాలెప్…2019 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ వేటకు… హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. తన కెరియర్ లో తొలిసారిగా గత ఏడాదే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అందుకొన్న హాలెప్… టైటిల్ నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది. 27 ఏళ్ల హాలెప్ కు 37 సంవత్సరాల వెటరన్ సెరెనా విలియమ్స్ నుంచి గట్టి […]

2019 ఫ్రెంచ్ ఓపెన్ హాట్ ఫేవరెట్ సిమోనా హాలెప్
X
  • అరుదైన రికార్డుకు హాలెప్ తహతహ
  • డిఫెండింగ్ చాంపియన్ గా టైటిల్ ఫైట్

ప్రపంచ మహిళా టెన్నిస్ మాజీ నంబర్ వన్ , రుమేనియన్ టెన్నిస్ క్వీన్ సిమోనా హాలెప్…2019 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ వేటకు… హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

తన కెరియర్ లో తొలిసారిగా గత ఏడాదే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అందుకొన్న హాలెప్… టైటిల్ నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది. 27 ఏళ్ల హాలెప్ కు 37 సంవత్సరాల వెటరన్ సెరెనా విలియమ్స్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.

మరోవైపు ప్రపంచ నంబర్ వన్ నవోమీ అంతంత మాత్రం ఫామ్ లోనే ఉండటం, సెరెనా ఫిట్ నెస్ సమస్యలతో సతమవుతూ ఉండటం వంటి అంశాలు…. సూపర్ ఫిట్ సిమోనా హాలెప్ కు అనుకూలంగా మారాయి.

టైటిల్ నిలుపుకోడమే అసలు పరీక్ష….

ఫ్రెంచ్ మహిళా టెన్నిస్ చరిత్రలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగి టైటిల్ నిలుపుకొన్న ఘనత కేవలం ఐదుగురు ప్లేయర్లు మాత్రమే సాధించగలిగారు.

మార్గారెట్ కోర్టు, క్రిస్ ఎవర్ట్, మోనికా సెలెస్, స్టెఫీ గ్రాఫ్, జస్టిన్ హెనిన్ మాత్రమే విజయవంతంగా టైటిల్ నిలుపుకోగలిగారు. ఇప్పుడు వారి సరసన నిలవటానికి సిమోనా హాలెప్ తహతహలాడుతోంది.

డబుల్ విన్నర్ హాలెప్….

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల జూనియర్, సీనియర్ టైటిల్స్ సాధించిన అరుదైన రికార్డు హాలెప్ కు ఉంది. 2008 సీజన్లో ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ టైటిల్ నెగ్గిన హాలెప్ 2018లో సీనియర్ మహిళల టైటిల్ సైతం సొంతం చేసుకోడం విశేషం.

మరికొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను హాలెప్ నిలుపుకోగలదా… అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా నిలిచింది.

First Published:  26 May 2019 12:55 AM GMT
Next Story