డేట్ ఫిక్స్ చేసిన ఇస్మార్ట్ శంకర్

రామ్-పూరి కాంబోలో ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఓ 3 పాటలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇలా ఓవైపు సినిమా మొత్తం కంప్లీట్ అవుతున్నప్పటికీ రిలీజ్ డేట్ మాత్రం ఎనౌన్స్ చేయలేదు మేకర్స్. ఎట్టకేలకు ఆ ముహూర్తం రానే వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను జులై 12న విడుదల చేస్తామని ప్రకటించారు నిర్మాతలు పూరి జగన్నాధ్, చార్మి. నిజానికి ఈ సినిమా జూన్ కే రెడీ అయిపోతుంది. కానీ ఈసారి ప్రచారాన్ని కాస్త విభిన్నంగా, ఇంకాస్త ఎక్కువ రోజులు చేయాలనే ఆలోచనలో విడుదల తేదీని జులైకి షిఫ్ట్ చేశారు.

రామ్-పూరి కాంబినేషన్ అయితే ఫ్రెష్. కానీ ఆ ఫ్రెష్ నెస్ టీజర్ లో, పోస్టర్లలో కనిపించడం లేదు. అందుకే ఇస్మార్ట్ శంకర్ పై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి. దీనికి తోడు ఇటు రామ్, అటు పూరీల ట్రాక్ రికార్డు కూడా ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో ఇస్మార్ట్ శంకర్ ను పట్టించుకునేవాళ్లు తగ్గారు. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.