Telugu Global
NEWS

ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్..?

ఏపీ ముఖ్యమంత్రిగా మరో నాలుగు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ అప్పుడే ప్రభుత్వ శాఖల్లోని కీలక పదవుల్లో ఎవరిని నియమించాలో ఒక నిర్ణయానికి వచ్చేశారు. జగన్ గెలిచిన తర్వాత పలు పర్యాయాలు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో జగన్ సమావేశమయ్యారు. అప్పుడే పోలీసు బాస్‌గా గౌతమ్ సవాంగ్‌ను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 30వ తేదీన జరుగనున్న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన భద్రత ఏర్పాట్లను సవాంగ్ పర్యవేక్షిస్తున్నారు. నిన్న సీఎస్ నిర్వహించిన […]

ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్..?
X

ఏపీ ముఖ్యమంత్రిగా మరో నాలుగు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ అప్పుడే ప్రభుత్వ శాఖల్లోని కీలక పదవుల్లో ఎవరిని నియమించాలో ఒక నిర్ణయానికి వచ్చేశారు. జగన్ గెలిచిన తర్వాత పలు పర్యాయాలు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో జగన్ సమావేశమయ్యారు. అప్పుడే పోలీసు బాస్‌గా గౌతమ్ సవాంగ్‌ను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే 30వ తేదీన జరుగనున్న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన భద్రత ఏర్పాట్లను సవాంగ్ పర్యవేక్షిస్తున్నారు. నిన్న సీఎస్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి డీజీపీ ఠాకూర్‌తో పాటు సవాంగ్ కూడా పాల్గొన్నారు. సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి ఈ భేటీలో చర్చించారు. అనంతరం డీజీపీ ఠాకూర్ హైదరాబాద్ వెళ్లిపోయారు.

కాగా, గత జులై నుంచి డీజీపీగా ఠాకూర్ వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఈసీఐ ఆయనను తప్పించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి ఆయన డీజీపీగా కొనసాగుతున్నారు. అయితే త్వరలోనే గౌతమ్ సవాంగ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం వెలువరించనుంది.

గౌతమ్ సవాంగ్ 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆయన ఏఎస్పీగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. చిత్తూరు, వరంగల్ ఎస్పీగా పని చేశారు. 2001-03 మధ్య వరంగల్ రేంజ్ డీఐజీగా పని చేశారు. సీఆర్‌పీఎఫ్ డీఐజీగా, శాంతి భద్రతల విభాగం ఐజీగా పని చేసిన అనుభవం ఉంది. ఆయన మూడేళ్ల పాటు లైబీరియాలో ఐక్యరాజ్యసమితి పోలీస్ కమిషనర్‌గా పని చేశారు.

First Published:  26 May 2019 12:04 AM GMT
Next Story