అరుదైన రికార్డు వైపు జోకోవిచ్ చూపు

  • రాడ్ లేవర్ సరసన చోటుకు తహతహ
  • ఫ్రెంచ్ ఓపెన్లో టాప్ సీడ్ స్టార్ గా జోకోవిచ్

ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జోకోవిచ్…గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డుకు గురిపెట్టాడు. ఓ సీజన్లో తాను సాధించిన నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను రెండోసారి నిలబెట్టుకోడం ద్వారా..ఆల్ టైమ్ గ్రేట్ రాడ్ లేవర్ సరసన నిలవాలన్న పట్టుదలతో ఉన్నాడు.

గత సీజన్లో సాధించిన వింబుల్డన్, అమెరికన్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ ను విజయవంతంగా నిలబెట్టుకొన్న జోకోవిచ్..
మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఫ్రెంచ్ ఓపెన్లో టాప్ సీడింగ్ ప్లేయర్ గా టైటిల్ వేటకు దిగుతున్నాడు.

32 ఏళ్ల జోకోవిచ్ మూడేళ్ల క్రితమే… తొలిసారిగా నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను విజయవంతంగా నిలుపుకోగలిగాడు.
గతంలో ఈ ఘనతను రెండుసార్లు సాధించిన రికార్డు… ఆస్ట్రేలియా దిగ్గజం రాడ్ లేవర్ పేరుతో ఉంది.

1962, 1969 సీజన్లలో క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ సాధించిన రికార్డు ఇప్పటికే తన కెరియర్ లో 15 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గి… ఫెదరర్, నడాల్ తర్వాతి స్థానాలలో ఉన్న జోకోవిచ్… గతవారం ముగిసిన ఇటాలియన్ ఓపెన్ ఫైనల్లో నడాల్ చేతిలో పరాజయం పొందిన సంగతి తెలిసిందే.

ప్రస్తుత సీజన్ ఫ్రెంచ్ ఓపెన్లో నడాల్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని…జోకో చెబుతున్నాడు. ఎందుకంటే …ఇప్పటికే 11సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించిన అరుదైన రికార్డు నడాల్ కు ఉందని జోకో గుర్తు చేశాడు.

గ్రాండ్ స్లామ్ చరిత్రలోనే అరుదైన రికార్డు సాధించడమే లక్ష్యంగా తాను ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గడానికి ప్రయత్నిస్తానని ప్రకటించాడు.

గత 14 సంవత్సరాలలో… ఫ్రెంచ్ ఓపెన్లో నడాల్ ను ఓడించిన ఇద్దరు ఆటగాళ్లలో జోకోవిచ్ సైతం ఉన్నాడు.

2019 సీజన్లో … ఇప్పటికే ఆస్ట్రేలియన్, వింబుల్డన్, యూఎస్ టైటిల్స్ సాధించిన జోకో… ఫ్రెంచ్ ఓపెన్ సైతం నెగ్గితే రెండోసారి సీజన్ గ్రాండ్ స్లామ్ సాధించిన మొనగాడిగా నిలిచిపోతాడు.