నిర్ణయం మార్చుకున్న లారెన్స్?

అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర లో ఇటీవలే రాఘవ లారెన్స్ దర్శకత్వం లో లక్ష్మి బాంబ్ అనే సినిమాని లాంచ్ చేశారు. కాంచన సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని తీయాలని అనుకున్నారు దర్శక నిర్మాతలు.

అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే లారెన్స్ ఈ సినిమా నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇప్పుడు మరలా తన డెసిషన్ ని మార్చుకోవాలనే దిశగా ఉన్నాడని సమాచారం. ఇంతకు ముందు ఎందుకు వైదొలుగుతున్నాను అనే విషయం చెప్పిన లారెన్స్ దాని తర్వాత జరిగిన పరిణామాల మీద కూడా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.

“నేను ఈ రీమేక్ సినిమా నుంచి వెళ్లిపోతున్నా అని ట్వీట్ చేసిన దగ్గర నుండి, కొద్ది రోజులుగా అక్షయ్ కుమార్ అభిమానులు మరియు నా అభిమానులు ఈ సినిమా నుండి వైదొలగకూడదు అని నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే మీ అందరి ప్రేమ కి నేను ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. ఇక పోతే గత వారం రోజులు గా జరిగిన పరిణామాలు మాత్రం నన్ను ఎంతగానో బాధించాయి. మీరు ఎంత బాధ పడ్డారో నేను కూడా అంతే బాధ పడ్డాను.” అని లారెన్స్ తెలిపాడు.