బన్నీ కోసం థమన్ ప్రయోగాలు

అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో అగ్ర గామి గా వెలుగొందుతున్న నటుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఒక సినిమా ని చేస్తున్న బన్నీ ఈ సినిమా కోసం ఒక కొత్త గెటప్ లో కనిపించనున్నాడు.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూట్ పూర్తి చేసుకున్న మేకర్స్, త్వరలో ఒక కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టనున్నారు. అయితే అల్లు అర్జున్ ఇటీవలే విహార యాత్ర నుండి ఇండియా కి తిరిగి వచ్చి తన షూట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు.

ఈ సినిమా కి థమన్ ని సంగీత దర్శకుడి గా ఎంచుకున్నారు మేకర్స్. థమన్ ఆల్రెడీ అల్లు అర్జున్ తో పని చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సంగీతం పరంగా విజయం సాధించాయి.

ఇప్పుడు కూడా థమన్ ఈ సినిమాని కూడా సంగీతం పరంగా అల్లు అర్జున్ కు హిట్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. ఈ సినిమా సౌండింగ్ విషయంలో థమన్ కొన్ని ప్రయోగాలు చేయబోతున్నట్లు చెబుతున్నారు. అయితే దీని గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.