షూటింగ్ లేదు…. కానీ రాజమౌళి ఏం చేస్తున్నాడో తెలుసా?

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం తన తదుపరి సినిమా ఆర్ఆర్ఆర్ కి సంబంధించిన పనులతో బిజీ గా గడుపుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరగాల్సింది కానీ అనుకోని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరగడం లేదు.

అయితే ఈ బ్రేక్ టైం ని మాత్రం రాజమౌళి చాలా బాగా ఉపయోగించుకుంటున్నాడు. సినిమా కి సంబంధించి టీమ్ మొత్తం ఈ బ్రేక్ ని ఎంజాయ్ చేస్తుండగా రాజమౌళి మాత్రం పనిలోనే నిమగ్నమై ఉన్నాడు.

షూటింగ్ కు సంబంధించిన షెడ్యూలింగ్ అంతా ఆల్రెడీ డిస్కస్ చేసేసిన రాజమౌళి…. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ టీమ్ తో స్పెషల్ డిస్కషన్స్ చేస్తున్నాడట. సినిమా కి సంబంధించిన లుక్స్ ఎలా ఉండాలి, గ్రాఫిక్స్ ఎలా ఉండాలి అనే విషయాలు తన టీమ్ కి తెలియజేస్తున్నాడట రాజమౌళి.

అయితే రాజమౌళి ఎప్పటికప్పుడు టీమ్ అందరినీ ఉత్సాహపరుస్తుండటం చూస్తుంటే ఈ సారి సినిమా డిలే లేకుండా టైం కి వచ్చేలా ఉంది అంటున్నారు అంతా. అంతే కాకుండా ఈ సారి తదుపరి షెడ్యూల్స్ ని ఎక్కువ గ్యాప్ లేకుండా ప్లాన్ చేయమని తన కో డైరెక్టర్ కి ఆదేశాలు ఇచ్చాడట జక్కన్న.