ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కి ఎనిమిది కోట్లు !

విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా విడుదల కోసం వేచి చూడటమే కాకుండా రెండు సినిమాల కి సంబందించిన షూటింగ్ లలో కూడా పాల్గొంటున్నాడు.

వరుసగా క్రాంతి మాధవ్ దర్శకత్వం లో ఒక సినిమా, అంతే కాకుండా, హీరో అనే మరో సినిమా షూటింగ్ లో విజయ్ పాల్గొంటున్నాడు. ఇండస్ట్రీ కథనాల ప్రకారం విజయ్ నటిస్తున్న ఈ హీరో అనే చిత్రం యొక్క బడ్జెట్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో నే కాస్ట్లీ ప్రాజెక్ట్ గా ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా లో బైక్ స్టంట్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి అని తెలుస్తుంది. అందుకు గాను సినిమా లో ఒక ప్రధాన ఎపిసోడ్ కోసం దాదాపు గా ఎనిమిది కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట నిర్మాతలు.

ఈ విషయం ఇప్పుడు అందరి దృష్టి ని ఆకర్శిస్తోంది. ఒకటి రెండు కోట్ల బడ్జెట్ తో మొదలైన విజయ్ ప్రస్థానం ఇప్పుడు ఏకం గా ఒక సన్నివేశం కోసం ఎనిమిది కోట్లు పెట్టె రేంజ్ కి పెరిగింది. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.