Telugu Global
Health & Life Style

కొంచెం తేనె... బోలెడు చర్మ సౌందర్యం !

మానవుడికి ప్రకృతి అందించిన మరో దివ్యౌషధం తేనె. తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. తేనె వల్ల ఎన్నోఉపయోగాలున్నాయి. అయితే ముందుగా చర్మ సౌందర్యానికి తేనె చాలా బాగా పనిచేస్తుంది. ఆ ఉపయోగాల గురించి తెలుసుకుందాం. చెంచాడు తేనె ప్రతి రోజూ ఉదయాన్నే తాగితే చర్మంలోని సూక్ష్మరంధ్రాలలో ఉన్న మలినాలను కూడా శుభ్ర పరుస్తుంది. చిటికెడు తేనె తీసుకోవడం వల్ల చర్మవ్యాధులు, మొటిమలు, మచ్చలు మటుమాయం అవుతాయి. పెదవులు పగిలితే తేనె దివ్య ఔషదం. పగిలిన పెదాలకు తేనెను […]

కొంచెం తేనె... బోలెడు చర్మ సౌందర్యం  !
X

మానవుడికి ప్రకృతి అందించిన మరో దివ్యౌషధం తేనె. తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. తేనె వల్ల ఎన్నోఉపయోగాలున్నాయి. అయితే ముందుగా చర్మ సౌందర్యానికి తేనె చాలా బాగా పనిచేస్తుంది. ఆ ఉపయోగాల గురించి తెలుసుకుందాం.

  • చెంచాడు తేనె ప్రతి రోజూ ఉదయాన్నే తాగితే చర్మంలోని సూక్ష్మరంధ్రాలలో ఉన్న మలినాలను కూడా శుభ్ర పరుస్తుంది.
  • చిటికెడు తేనె తీసుకోవడం వల్ల చర్మవ్యాధులు, మొటిమలు, మచ్చలు మటుమాయం అవుతాయి.
  • పెదవులు పగిలితే తేనె దివ్య ఔషదం. పగిలిన పెదాలకు తేనెను రాస్తే కొంత సేపటికి పెదవులు మృదువుగా తయారవుతాయి.
  • ఉదయాన్నే తేనె తీసుకుంటే అది రక్తహీనత నుంచి కాపాడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • కొంచెం వేడినీళ్లలో తేనె కలుపుకుని తాగితే మలబద్దకం తగ్గుతుంది. సుఖ విరోచనానికి తేనే ఎంతో మంచిది.
  • ఫంగస్, బ్యాక్టీరియాల ద్వారా సంక్రమించే వ్యాధులకు తేనె మంచి మందు.
  • తేనెలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఆక్సీడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. శరీరం లోపలా, బయటా కూడా వచ్చే అంటురోగాలను తేనె తీసుకోవడం ద్వారా నివారించవచ్చు.
  • తేనె శరీరంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది.
  • చర్మం కమిలిపోయినట్లుగా కాని, ఎండిపోయినట్లుగా కాని అనిపిస్తే వెంటనె కొంచెం తేనెను మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • కాలిన గాయాలకు, ఇతర గాయాలకు తేనె రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
First Published:  26 May 2019 10:45 PM GMT
Next Story