Telugu Global
Cinema & Entertainment

మహర్షి వసూళ్లు.... రూ. 2 కోట్లు నష్టం

మహేష్ బాబు నటించిన సినిమాలు సూపర్ హిట్ అయినప్పటికీ కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతుంటాయి. గతంలో భరత్ అనే నేను సినిమా వరల్డ్ వైడ్ హిట్ అయింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది బయ్యర్లకు నష్టాలే మిగిల్చింది. ఈసారి కూడా అదే రిపీటైంది. మహర్షి సినిమా హిట్ అయింది…. బయ్యర్లు మాత్రం లాస్ అయ్యారు. ఓవర్సీస్ లో నిన్నటితో దాదాపు ఈ సినిమా రన్ పూర్తయింది. ఓవరాల్ గా ఈ సినిమాకు 1.83 మిలియన్ డాలర్లు వసూళ్లు వచ్చాయి. […]

మహర్షి వసూళ్లు.... రూ. 2 కోట్లు నష్టం
X

మహేష్ బాబు నటించిన సినిమాలు సూపర్ హిట్ అయినప్పటికీ కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతుంటాయి. గతంలో భరత్ అనే నేను సినిమా వరల్డ్ వైడ్ హిట్ అయింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది బయ్యర్లకు నష్టాలే మిగిల్చింది. ఈసారి కూడా అదే రిపీటైంది. మహర్షి సినిమా హిట్ అయింది…. బయ్యర్లు మాత్రం లాస్ అయ్యారు.

ఓవర్సీస్ లో నిన్నటితో దాదాపు ఈ సినిమా రన్ పూర్తయింది. ఓవరాల్ గా ఈ సినిమాకు 1.83 మిలియన్ డాలర్లు వసూళ్లు వచ్చాయి. మహా అయితే మరో 10వేల డాలర్లు వచ్చే ఛాన్స్ ఉంది. 2 మిలియన్ మార్క్ మాత్రం టచ్ చేయదు.

తాజా వసూళ్లతో ఓవర్సీస్ లో మహర్షి సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అనిపించుకుంది. నిన్నటి వసూళ్లతో కలుపుకుంటే ఈ సినిమా యూఎస్ డిస్ట్రిబ్యూటర్లకు 2 కోట్ల రూపాయల నష్టం తెచ్చిపెట్టింది. అయితే ఈ నష్టాన్ని కొంతలో కొంత దిల్ రాజు కూడా భరించాల్సి రావొచ్చు.

తెరవెనక చేసుకున్న ఒప్పందాల ప్రకారం.. మహర్షి హిట్ అయితే లాభాల్లో వాటా, ఫ్లాప్ అయితే సగం నష్టాన్ని భరించేలా ఒప్పందం చేసుకున్నారట దిల్ రాజు. అదిప్పుడు దిల్ రాజు మెడకు చుట్టుకుంది. కోటి రూపాయలు డిస్ట్రిబ్యూటర్లకు వెనక్కి ఇవ్వాల్సి వస్తోంది.

First Published:  27 May 2019 2:21 AM GMT
Next Story