Telugu Global
NEWS

బాబు ఓటమికి కారణం చెప్పిన మందకృష్ణ

అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఆ ఓటమికి కారణాలను అడిగిన వాళ్ళూ, అడగని వాళ్ళూ అంతా విశ్లేషించి చెబుతున్నారు. చంద్రబాబు ఓటమికి కారణాలు చెప్పే లిస్టులో ఇప్పుడు తాజాగా మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేరాడు. చంద్రబాబును ఓడించమని తానే పిలుపునిచ్చానని, చంద్రబాబు ఓటమికోసమే మాదిగ పోరాట సమితి కృషి చేసిందని చెప్పారు. చంద్రబాబు పరిపాలనంతా మోసాల మయం కావడంతో మాదిగలంతా తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారని ఆయన అన్నారు. […]

బాబు ఓటమికి కారణం చెప్పిన మందకృష్ణ
X

అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఆ ఓటమికి కారణాలను అడిగిన వాళ్ళూ, అడగని వాళ్ళూ అంతా విశ్లేషించి చెబుతున్నారు. చంద్రబాబు ఓటమికి కారణాలు చెప్పే లిస్టులో ఇప్పుడు తాజాగా మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేరాడు. చంద్రబాబును ఓడించమని తానే పిలుపునిచ్చానని, చంద్రబాబు ఓటమికోసమే మాదిగ పోరాట సమితి కృషి చేసిందని చెప్పారు.

చంద్రబాబు పరిపాలనంతా మోసాల మయం కావడంతో మాదిగలంతా తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణ గురించి జగన్‌ ఏమీ హామీ ఇవ్వకపోవడంతో జగన్‌కు కూడా ఓటు వెయ్యవద్దని…. నోటాకు ఓటు వెయ్యండని తాను చెప్పినప్పటికీ జనం వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారన్నారు.

కొద్ది నెలల క్రితం తెలంగాణ అంసెబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మహాకూటమికి, చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన మందకృష్ణ మాదిగ ఇప్పుడు ఇలా మాట్లాడడంతో తెలుగుదేశం అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

First Published:  26 May 2019 11:02 PM GMT
Next Story