Telugu Global
NEWS

ప్రపంచ పురుషుల క్లే కోర్టు టెన్నిస్ లో తిరుగులేని మొనగాడు

ప్రపంచ పురుషుల క్లే కోర్టు టెన్నిస్ లో తిరుగులేని మొనగాడు, స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ 12వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కు గురిపెట్టాడు. మూడేళ్ల విరామం తర్వాత… మరోసారి ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన నడాల్ ..ఇటాలియన్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జోకోవిచ్ ను చిత్తు చేయడం ద్వారా కెరియర్ లో 18వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు సిద్ధమని ప్రకటించాడు. స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్…మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే 2019 […]

ప్రపంచ పురుషుల క్లే కోర్టు టెన్నిస్ లో తిరుగులేని మొనగాడు
X

ప్రపంచ పురుషుల క్లే కోర్టు టెన్నిస్ లో తిరుగులేని మొనగాడు, స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ 12వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కు గురిపెట్టాడు.

మూడేళ్ల విరామం తర్వాత… మరోసారి ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన నడాల్ ..ఇటాలియన్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జోకోవిచ్ ను చిత్తు చేయడం ద్వారా కెరియర్ లో 18వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు సిద్ధమని ప్రకటించాడు.

స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్…మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే 2019 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కు గురిపెట్టాడు. తన కెరియర్ లో ఇప్పటికే 11సార్లు రోలాండ్ గారోస్ కింగ్ గా నిలిచిన నడాల్ 12వ ఫ్రెంచ్ టైటిల్ కోసం తహతహలాడుతున్నాడు.

ఇటాలియన్ ఓపెన్లో తిరుగులేని నడాల్…

ప్రస్తుత సీజన్ రెండో గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ కు సన్నాహకంగా జరిగిన ఇటాలియన్ ఓపెన్ ఫైనల్స్ నడాల్ షోగా ముగిసింది.

తన కెరియర్ లో 11వసారి ఇటాలియన్ ఫైనల్ చేరిన నడాల్ …టైటిల్ సమరంలో ప్రపంచ నంబర్ వన్ జోకోవిచ్ ను 6-0, 4-6, 6-1తో చిత్తు చేయడం ద్వారా తొమ్మిదోసారి ట్రోఫీ అందుకొన్నాడు. అంతేకాదు…. నడాల్ కెరియర్ లో ఇది రికార్డు స్థాయిలో 34వ మాస్టర్స్ టైటిల్ కావడం విశేషం.

నడాల్ ఖాతాలో 81వ టైటిల్

32 ఏళ్ల నడాల్ తన కెరియర్ టైటిళ్ల సంఖ్యను 81కు పెంచుకొన్నాడు. మొత్తం 17 గ్రాండ్ స్లామ్, 34 మాస్టర్స్ తో సహా ఇటాలియన్ ఓపెన్ తో కలిసి 81 టైటిల్స్ సాధించాడు.

అంతేకాదు…. చిరకాల ప్రత్యర్థి జోకోవిచ్ తో…. 34సార్లు తలపడి…. 26-28 రికార్డుతో నిలిచాడు. ఇటాలియన్ ఓపెన్ ఫైనల్లో జోకోవిచ్ తో ఐదుసార్లు ఢీ కొన్న నడాల్ కు ఇది మూడో గెలుపు కావడం విశేషం.

11 ఫ్రెంచ్ టైటిల్స్…

నడాల్ కు గతంలో 2005 నుంచి 2008 వరకు… వరుసగా నాలుగుసార్లు, తిరిగి…2010 నుంచి 2014 వరకు వరుసగా ఐదు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెల్చుకున్న అసాధారణ రికార్డు ఉంది. 2014 తర్వాత నడాల్ రెండేళ్ల విరామం లోనే తిరిగి రెండుసార్లు టైటిల్ అందుకోడం ద్వారా.. తన ఫ్రెంచ్ టైటిళ్ల సంఖ్యను 11క పెంచుకోగలిగాడు.

ఫెదరర్ తర్వాతి స్థానంలో..

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో ఫెదరర్ అత్యధికంగా 20 టైటిల్స్ సాధించి నంబర్ వన్ స్థానంలో నిలిస్తే…17 టైటిల్స్ తో నడాల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. త్వరలో ప్రారంభమయ్యే ఫ్రెంచ్ ఓపెన్లో మరోసారి నడాల్ విజేతగా నిలిస్తే తన గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సంఖ్యను 18కు పెంచుకోగలుగుతాడు.

అరుదైన రికార్డు…

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో కనీసం ఒక్క సెట్‌ ఓడకుండా… మూడుసార్లు టైటిల్స్ నెగ్గిన అసాధారణ రికార్డు నడాల్ కు ఉంది. గతంలో ఇదే ఘనత సాధించినవారిలో ఫెదరర్, నస్టాసే, కెన్ రోజ్ వాల్ ఉన్నారు.

క్లే కోర్టు లో 400కు పైగా విజయాలు

స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్….క్లే కోర్టు టెన్నిస్ లో తానే కింగ్ నని మరోసారి చాటుకొన్నాడు. 400 విజయాల రికార్డు అందుకొన్న తొలి ప్లేయర్ గా నిలిచాడు. 2018 బార్సిలోనా క్లే కోర్టు టైటిల్ ను 11వ సారి నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించాడు.
మాంటేకార్లో క్లే కోర్టు టైటిల్ ను 11వ సారి నెగ్గిన నడాల్… వరుసగా 46 సెట్ల విజయాలు సాధించడం విశేషం.

అంతేకాదు…32 సంవత్సరాల నడాల్ …క్లే కోర్టులో తానే మొనగాడినని, తనకు పోటీనే లేదని… తనకుతానే సాటని చాటుకోడానికి సిద్ధంగా ఉన్నాడు.

First Published:  26 May 2019 9:11 PM GMT
Next Story