దర్శకేంద్రుడి రాజీనామా!

తిరుమల తిరుపతి దేవస్థానం కు ప్రతి రోజూ లక్షలలో భక్తులు వస్తూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామీ ని దర్శించి ఆ దేవుని ఆశీస్సుల కోసం వచ్చే భక్తుల కోసం ఒక బోర్డు ని నెలకొల్పింది ప్రభుత్వం. అందులో భాగం గా నే తిరుమల లో జరిగే సేవా కార్యక్రమాల గురించి, ఉత్సవాల గురించి, దేవుని ఆరాధనా కార్యక్రమాల గురించి, సాంస్కృతిక కార్యక్రమాల గురించి, నాద నీరాజనం కార్యక్రమం గురించి, ఇతర అన్ని కార్యక్రమాల గురించి భక్తులను ఎప్పటికప్పుడు అందుబాటు లో ఉంచడానికి శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్ ని కూడా నెలకొల్పారు.

ప్రస్తుతం ఈ ఛానెల్ కి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చైర్మన్ గా ఉన్నారు. గతంలో అన్నమయ్య, ఓం నమో వెంకటేశాయ వంటి చిత్రాలు తీశాడు రాఘవేంద్ర రావు.

ఇప్పుడు తాజా సమాచారం మేరకు, అయన ఈ పదవి కి రాజీనామా చేశాడు. వయోభారం వల్ల చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు, అలాగే టీ టీ డి యాజమాన్యానికి, సిబ్బందికి వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలి అని ఆయన ఈ నేపథ్యం లో పేర్కొన్నట్లు తెలుస్తుంది.