Telugu Global
Cinema & Entertainment

హిందీ లో.... 'సైరా'

తెలుగు సినిమా పరిశ్రమ లో ప్రస్తుతం ప్రతిష్టాత్మక సినిమాల్లో ఒకటి సై రా నరసింహా రెడ్డి. చిరంజీవి ప్రధాన పాత్ర లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి చేరుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమాని హిందీలో విడుదల చేయాలనీ భావించిన నిర్మాతలకి సరైన పంపిణీ దారుడు దొరక్కపోవడం తో నిరాశ చెందారు దర్శక నిర్మాతలు. అయితే ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమాకి హిందీ లో పంపిణీదారుడు దొరికాడు అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. […]

హిందీ లో.... సైరా
X

తెలుగు సినిమా పరిశ్రమ లో ప్రస్తుతం ప్రతిష్టాత్మక సినిమాల్లో ఒకటి సై రా నరసింహా రెడ్డి. చిరంజీవి ప్రధాన పాత్ర లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి చేరుకుంది.

ఇప్పటి వరకు ఈ సినిమాని హిందీలో విడుదల చేయాలనీ భావించిన నిర్మాతలకి సరైన పంపిణీ దారుడు దొరక్కపోవడం తో నిరాశ చెందారు దర్శక నిర్మాతలు. అయితే ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమాకి హిందీ లో పంపిణీదారుడు దొరికాడు అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా ని నిర్మిస్తున్న రామ్ చరణ్ హిందీలో ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ కి హిందీ హక్కుల ని అమ్మినట్లు సమాచారం. భారీ ఎత్తున ఈ సినిమా ని హిందీ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు చరణ్. ఫర్హాన్ అక్తర్ మరియు రితేష్ సిద్వానీ ఈ సినిమా ని హిందీ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమా ని ఎక్కువ మొత్తం చెల్లించి మరీ దక్కించుకున్నట్లు వినికిడి.

అయితే వీరే ఇంతకు ముందు యాష్ నటించిన కెజీఎఫ్ సినిమా ని హిందీ లో విడుదల చేశారు. ఆ సినిమా కూడా పెద్ద ఎత్తున విజయం కావడం తో ఈ సినిమా కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు.

First Published:  27 May 2019 5:10 AM GMT
Next Story