Telugu Global
NEWS

జగన్ ఎవరెవరిని స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించాడో తెలుసా..?

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గురువారం (30 మే) రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏపీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టెంట్ (జీఏడీ) నుంచి రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యులకు అధికారికంగా ఆహ్వానాలు అందుతున్నాయి. కానీ, జగన్ మాత్రం కొంత మందికి స్వయంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానిస్తున్నారట. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడిని ఫోన్ చేసి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానించారు. గతంలో చంద్రబాబు గెలిచి, జగన్ ఓడినప్పుడు…. చంద్రబాబు కేవలం […]

జగన్ ఎవరెవరిని స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించాడో తెలుసా..?
X

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గురువారం (30 మే) రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏపీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టెంట్ (జీఏడీ) నుంచి రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యులకు అధికారికంగా ఆహ్వానాలు అందుతున్నాయి. కానీ, జగన్ మాత్రం కొంత మందికి స్వయంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానిస్తున్నారట.

ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడిని ఫోన్ చేసి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానించారు. గతంలో చంద్రబాబు గెలిచి, జగన్ ఓడినప్పుడు…. చంద్రబాబు కేవలం జీఏడీ కార్యదర్శితో ఒక ఆహ్వాన పత్రికను జగన్‌కు పంపాడు. కానీ ఇప్పుడు స్వయంగా జగనే ఫోన్ చేసి ఆహ్వానించారు.

ఇక ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరకు కూడా జగన్ ఫోన్ చేశారట. మీకు మా కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉంది.. రాజకీయాలు వేరు…. కుటుంబ పరిచయాలు వేరు.. మీరు తప్పక రావాలని జగన్ కోరారట. సీపీఐ రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి మధుకు కూడా స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారట జగన్.

ఇక అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే.. మెగా స్టార్ చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్‌కు కూడా కాల్ చేశారట జగన్. చిరంజీవికి కాల్ చేసి మీలాంటి పెద్దల ఆశీర్వాదం కావాలి.. స్వయంగా నేనే పిలుస్తున్నాను కదా మీరు తప్పక రావాలి అని అన్నారట.

మరోవైపు పవన్‌కు కాల్ చేసి మీరు ఎన్నికల్లో గట్టిగా ఫైట్ చేశారు…. ఇక రాజకీయాలు పక్కన పెట్టి సోదర భావంతో నా ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారట. డీఎంకే అధినేత స్టాలిన్‌కి కూడా జగన్ నుంచి కాల్ వెళ్లిందని తెలుస్తోంది.

ఇలా ముఖ్యులందరికీ ఫోన్లు చేసి స్వయంగా ఆహ్వానిస్తున్న జగన్‌ను చూసి పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  28 May 2019 12:23 PM GMT
Next Story