Telugu Global
Cinema & Entertainment

సీనియర్ హీరోతో మెహ్రీన్

ఈ ఏడాది మొదట్లో విడుదల అయ్యి అతి పెద్ద విజయం సాధించిన సినిమా F2. అయితే ఈ సినిమా వలన లాభపడిన వాళ్లలో హీరోయిన్లు లేరు. మరీ ముఖ్యం గా మెహ్రీన్ కి ఈ సినిమా తో పెద్దగా ఉపయోగపడింది ఏమి లేదు. అందుకే పెద్ద బ్లాక్ బాస్టర్ లో భాగం అయినప్పటికీ ఇప్పటి దాకా ఇంకో కొత్త చిత్రాన్ని ఆమె ప్రారంభించలేకపోయింది. అయితే తమిళం లో కూడా అడుగు పెట్టిన ఈ బ్యూటీ కి అక్కడా […]

సీనియర్ హీరోతో మెహ్రీన్
X

ఈ ఏడాది మొదట్లో విడుదల అయ్యి అతి పెద్ద విజయం సాధించిన సినిమా F2. అయితే ఈ సినిమా వలన లాభపడిన వాళ్లలో హీరోయిన్లు లేరు. మరీ ముఖ్యం గా మెహ్రీన్ కి ఈ సినిమా తో పెద్దగా ఉపయోగపడింది ఏమి లేదు.

అందుకే పెద్ద బ్లాక్ బాస్టర్ లో భాగం అయినప్పటికీ ఇప్పటి దాకా ఇంకో కొత్త చిత్రాన్ని ఆమె ప్రారంభించలేకపోయింది. అయితే తమిళం లో కూడా అడుగు పెట్టిన ఈ బ్యూటీ కి అక్కడా ఇక్కడా అవకాశాలు కరువయ్యాయి.

ఈ నేపథ్యం లో మెహ్రీన్ ఇక సీనియర్ హీరోలతో కూడా జత కట్టడానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది.

తాజా ఫిలిం నగర్ సమాచారం ప్రకారం బాలకృష్ణ మరియు రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న రూలర్ అనే చిత్రం లో మెహ్రీన్ హీరోయిన్ గా చేయనుంది అంట. సి కళ్యాణ్ నిర్మాణం లో రానున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి వెళ్లనుంది.

ఈ సినిమా లో చాలా మంది హీరోయిన్లని అనుకున్న ఫిలిం యూనిట్ చివరికి మెహ్రీన్ ని లాక్ చేశారు అని టాక్. మెహ్రీన్ తో పాటు ఈ సినిమా లో పాయల్ రాజ్ పుత్ కూడా మెరవనుంది.

First Published:  28 May 2019 12:31 AM GMT
Next Story