Telugu Global
Cinema & Entertainment

మౌనం వీడిన రాఘవేంద్ర రావు

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ప్రస్తుతం తన తదుపరి చిత్రం గురించి తపన పడుతూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ తర్వాత ఇంకో సినిమా ఏమి మొదలు పెట్టని ఈ దర్శకుడు ప్రస్తుతం ఒక కొత్త చిత్రం తో రానున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి అనేక మార్లు సోషల్ మీడియా లో చర్చ జరిగినా ఇప్పటి వరకు దర్శకుడు నోరు విప్పలేదు. అయితే నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భం గా ఈ సినిమా గురించి అధికారికం గా ఒక […]

మౌనం వీడిన రాఘవేంద్ర రావు
X

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ప్రస్తుతం తన తదుపరి చిత్రం గురించి తపన పడుతూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ తర్వాత ఇంకో సినిమా ఏమి మొదలు పెట్టని ఈ దర్శకుడు ప్రస్తుతం ఒక కొత్త చిత్రం తో రానున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి అనేక మార్లు సోషల్ మీడియా లో చర్చ జరిగినా ఇప్పటి వరకు దర్శకుడు నోరు విప్పలేదు.

అయితే నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భం గా ఈ సినిమా గురించి అధికారికం గా ఒక ప్రకటన చేశారు. “నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో. #JoharNTR” అని రాఘవేందర్ రావు తన ట్విట్టర్ ప్రొఫైల్ లో పేర్కొన్నారు.

సో ఇక ఈ సినిమా గురించిన మిగిలిన వివరాలు తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి…

Posted by K Raghavendra Rao on Monday, 27 May 2019

First Published:  28 May 2019 12:04 AM GMT
Next Story