Telugu Global
NEWS

భారత మహిళా షూటర్ కు టోక్యో ఒలింపిక్స్ బెర్త్

25 మీటర్ల పిస్టల్ షూటింగ్ లో బంగారు పతకం మ్యూనిచ్ ప్రపంచకప్ షూటింగ్ లో భారత్ జోరు ఏర్ పిస్టల్ 10 మీటర్ల విభాగంలో సౌరభ్ చౌదరి ప్రపంచరికార్డు మ్యూనిచ్ వేదికగా జరుగుతున్న 2019 ప్రపంచకప్ షూటింగ్ లో భారత షూటర్లు రికార్డుల మోతతో బంగారు పంట పండించుకొన్నారు. మహిళల 25మీటర్ల పిస్టల్ షూటింగ్ లో భారత స్టార్ షూటర్ రాహీ సర్నోబట్ మొత్తం 37 పాయింట్లతో విజేతగా నిలిచింది. ఈ విజయంతో టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనటానికి […]

భారత మహిళా షూటర్ కు టోక్యో ఒలింపిక్స్ బెర్త్
X
  • 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ లో బంగారు పతకం
  • మ్యూనిచ్ ప్రపంచకప్ షూటింగ్ లో భారత్ జోరు
  • ఏర్ పిస్టల్ 10 మీటర్ల విభాగంలో సౌరభ్ చౌదరి ప్రపంచరికార్డు

మ్యూనిచ్ వేదికగా జరుగుతున్న 2019 ప్రపంచకప్ షూటింగ్ లో భారత షూటర్లు రికార్డుల మోతతో బంగారు పంట పండించుకొన్నారు.

మహిళల 25మీటర్ల పిస్టల్ షూటింగ్ లో భారత స్టార్ షూటర్ రాహీ సర్నోబట్ మొత్తం 37 పాయింట్లతో విజేతగా నిలిచింది. ఈ విజయంతో టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనటానికి అర్హత సంపాదించింది.

ఆసియాక్రీడల 25 మీటర్ల షూటింగ్ లో బంగారు పతకం సాధించిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించిన రాహీ…ప్రపంచకప్ షూటింగ్ లో సైతం సత్తా చాటుకోడమే కాదు…ఒలింపిక్స్ బెర్త్ సైతం ఖాయం చేసుకొంది.

సౌరబ్ చౌదరి ప్రపంచరికార్డు…

పురుషుల 10 మీటర్ల ఏర్ పిస్టల్ షూటింగ్ లో భారత సంచలనం సౌరభ్ చౌదరి సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. మొత్తం 246.3 పాయింట్లు సాధించి…. ప్రపంచ సీనియర్, జూనియర్ రికార్డులను తిరగరాశాడు.

First Published:  27 May 2019 10:50 PM GMT
Next Story