Telugu Global
NEWS

ప్రపంచకప్ లో అత్యధిక పరుగుల సచిన్

నాలుగున్నర దశాబ్దాల వన్డే క్రికెట్ చరిత్రలో భాగంగా జరిగిన మొత్తం 11 ప్రపంచకప్ టోర్నీలలో వివిధ దేశాలకు చెందిన వందలాదిమంది ఆటగాళ్ళు పాల్గొన్నా…పలు రికార్డులు మాత్రం…భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతోనే చెక్కుచెదరకుండా ఉన్నాయి. రికార్డుల మాస్టర్ సచిన్…. భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు అంతర్జాతీయ క్రికెట్లో మాత్రమే కాదు…నాలుగేళ్లకోసారి జరిగే వన్డే ప్రపంచకప్ లో సైతం పలు అరుదైన రికార్డులున్నాయి. అత్యధిక పరుగులు, సెంచరీలు, హాఫ్ సెంచరీలు, రికార్డు భాగస్వామ్యాలు, ప్లేయర్ […]

ప్రపంచకప్ లో అత్యధిక పరుగుల సచిన్
X

నాలుగున్నర దశాబ్దాల వన్డే క్రికెట్ చరిత్రలో భాగంగా జరిగిన మొత్తం 11 ప్రపంచకప్ టోర్నీలలో వివిధ దేశాలకు చెందిన వందలాదిమంది ఆటగాళ్ళు పాల్గొన్నా…పలు రికార్డులు మాత్రం…భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతోనే చెక్కుచెదరకుండా ఉన్నాయి.

రికార్డుల మాస్టర్ సచిన్….

భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు అంతర్జాతీయ క్రికెట్లో మాత్రమే కాదు…నాలుగేళ్లకోసారి జరిగే వన్డే ప్రపంచకప్ లో సైతం పలు అరుదైన రికార్డులున్నాయి.

అత్యధిక పరుగులు, సెంచరీలు, హాఫ్ సెంచరీలు, రికార్డు భాగస్వామ్యాలు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల రికార్డులు సైతం సచిన్ పేరుతోనే ఉన్నాయి.

1992 ప్రపంచకప్ నుంచి 2011 ప్రపంచకప్ వరకూ…వరుసగా మొత్తం ఆరుటోర్నీల్లో పాల్గొన్న సచిన్ రికార్డుస్థాయిలో 2 వేల 278 పరుగులు సాధించాడు.

మొత్తం 45 మ్యాచ్ ల్లో 44 ఇన్నింగ్స్ ఆడిన మాస్టర్ 6 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలతో 56. 95 సగటు నమోదు చేశాడు.

2003 ప్రపంచకప్ లో సచిన్ విశ్వరూపం…

సౌతాఫ్రికా వేదికగా ముగిసిన 2003 ప్రపంచకప్ లో భారత్ రన్నరప్ గా నిలిచినా…మాస్టర్ సచిన్ టెండుల్కర్ మాత్రం అత్యుత్తమంగా రాణించాడు.

11 మ్యాచ్ ల్లో ఏకంగా 673 పరుగులు సాధించాడు. ఓ సింగిల్ ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక సెంచరీలు, పరుగులు సాధించిన ఘనత మాస్టర్ సచిన్ కు మాత్రమే దక్కుతుంది.

మాస్టర్ తర్వాతి స్థానంలో పంటర్ ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు సాధించిన మొదటి ఐదుగురు ఆటగాళ్లలో…రెండో స్థానం లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నిలిచాడు.

పాంటింగ్ తన కెరియర్ లో 46 ప్రపంచకప్ మ్యాచ్ ల్లో, 42 ఇన్నింగ్స్ ఆడి.. 1743 పరుగులు సాధించాడు. పాంటింగ్ సగటు 45.86గా ఉంది.

మూడో స్థానంలో సంగక్కర…

ప్రపంచకప్ చరిత్రలో మూడో అత్యుత్తమ స్కోరర్ శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర పేరుతో ఉంది. సంగక్కర మొత్తం
37 మ్యాచ్ ల్లో… 35 ఇన్నింగ్స్ ఆడి… 1532 పరుగులు సాధించాడు. సంగక్కర 56. 74 సగటు సైతం నమోదు చేశాడు.

నాలుగో స్థానంలో బ్రయన్ లారా…

వెస్టిండీస్ మాజీ కెప్టెన్, ఆల్ టైమ్ గ్రేట్ బ్రయన్ లారా…ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో నాలుగో స్థానంలో నిలిచాడు.

లారా 34 మ్యాచ్ ల్లో , 33 ఇన్నింగ్స్ ఆడి 1225 పరుగులు సాధించాడు. లారా 2 శతకాలు, 7 అర్థశతకాలతో సహా 42.24 సగటు సాధించాడు.

ఐదో స్థానంలో ఏబీ డివిలియర్స్…

ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు సాధించిన ఐదో అత్యుత్తమ ప్లేయర్ గా సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ నిలిచాడు.
ఏబీ డివిలియర్స్ తన కెరియర్ లో కేవలం మూడు ప్రపంచకప్ టోర్నీలలో మాత్రమే పాల్గొన్నాడు.

మొత్తం 23మ్యాచ్ లు, 22 ఇన్నింగ్స్ లో 1207 పరుగులతో .. 63.52 సగటు నమోదుచేశాడు. డివిలియర్స్ కు ప్రపంచకప్ టోర్నీలో నాలుగు సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు సాధించిన రికార్డు సైతం ఉంది.

ప్రస్తుత 2019 ప్రపంచకప్ లో పరుగుల హోరు, సెంచరీల జోరు కొనసాగించే మొనగాడు ఎవరో తెలుసుకోవాలంటే…మరికొద్ది వారాలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  27 May 2019 11:45 PM GMT
Next Story