Telugu Global
NEWS

అమిత్‌షాకు హోం.. గంభీర్‌కు క్రీడా శాఖ..?

సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకొని రెండో సారి నరేంద్ర మోడీ ప్రధాని కాబోతున్నారు. రేపు సాయంత్రం ఆయన ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మోడీతో పాటు ఎవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు..? వారిలో ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పలువురి పేర్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోడీ ఖండించారు. మంగళవారం […]

అమిత్‌షాకు హోం.. గంభీర్‌కు క్రీడా శాఖ..?
X

సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకొని రెండో సారి నరేంద్ర మోడీ ప్రధాని కాబోతున్నారు. రేపు సాయంత్రం ఆయన ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మోడీతో పాటు ఎవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు..? వారిలో ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో పలువురి పేర్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోడీ ఖండించారు. మంగళవారం నాడు మోడీ, షాలు కలసి దాదాపు 4 గంటల పాటు కేబినెట్ కూర్పుపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనారోగ్య కారణాలతో అరుణ్ జైట్లి, సుష్మా స్వరాజ్‌లు స్వచ్ఛందంగా రేసు నుంచి తప్పుకున్నారు. వీరిద్దరి స్థానాలను స్మృతి ఇరానీ, జయంత్ సిన్హాలతో భర్తీ చేసే అవకాశం ఉంది.

ఇక ఈ సారి కేబినెట్‌లో అమిత్ షా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన కేంద్ర హోం శాఖ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రస్తుతం హోం బాధ్యతలు చూస్తున్న రాజ్‌నాథ్ సింగ్ వ్యవసాయశాఖను చేపట్టవచ్చు. రక్షణ మంత్రిగా ప్రతాప్ రూడీ, రైల్వే శాఖ పీయుష్ గోయల్, మానవ వనరుల శాఖ నిర్మలా సీతారామన్‌కు దక్కవచ్చని తెలుస్తోంది. పాత వారిలో చాలా మందికి మంత్ర పదవులు దక్కినా శాఖల్లో మాత్రం మార్పు జరిగే అవకాశం ఉంది.

ఇక తొలి సారిగా రాజకీయాల్లోకి ప్రవేశించి తూర్పు ఢిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికైన క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కు కూడా మంత్రి పదవి లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు క్రీడా శాఖ కేటాయిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీయేలో భాగస్వాములైన అన్నాడీఎంకే, జేడీయూకు కూడా మంత్రి పదవులు ఇవ్వనున్నారు.

First Published:  29 May 2019 9:47 AM GMT
Next Story