Telugu Global
Cinema & Entertainment

మరో రెండేళ్లు మెగా కాంపౌండ్ లోనే

దర్శకుడు కొరటాల శివ లాక్ అయిపోయాడు. మరో రెండేళ్ల పాటు మెగా కాంపౌండ్ లోనే కొనసాగబోతున్నాడు. ప్రస్తుతానికైతే ఇది ఫిక్స్. మరో మెగా హీరో కూడా ఎంటరైతే అదనంగా మరో ఏడాది కూడా ఆ కాంపౌండ్ కే పరిమితం అయిపోతాడు కొరటాల. ఇంతకీ మేటర్ ఏంటంటే.. రామ్ చరణ్ తో కొరటాల సినిమా ఓకే అయింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. ఆర్-ఆర్-ఆర్ కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి […]

మరో రెండేళ్లు మెగా కాంపౌండ్ లోనే
X

దర్శకుడు కొరటాల శివ లాక్ అయిపోయాడు. మరో రెండేళ్ల పాటు మెగా కాంపౌండ్ లోనే కొనసాగబోతున్నాడు. ప్రస్తుతానికైతే ఇది ఫిక్స్. మరో మెగా హీరో కూడా ఎంటరైతే అదనంగా మరో ఏడాది కూడా ఆ కాంపౌండ్ కే పరిమితం అయిపోతాడు కొరటాల.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. రామ్ చరణ్ తో కొరటాల సినిమా ఓకే అయింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. ఆర్-ఆర్-ఆర్ కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందన్నమాట. ఈ గ్యాప్ లో చిరంజీవితో సినిమాను పూర్తిచేయాలి కొరటాల.

సో.. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యేసరికి కనీసం రెండేళ్లు పడుతుంది. ఆ తర్వాత బన్నీ మూవీ కూడా ఫిక్స్ అయిందంటే మరో ఏడాది మెగా కాంపౌండ్ లోనే ఉండిపోతాడు కొరటాల. అయితే ఎన్టీఆర్ హీరోగా కొరటాల ఓ సినిమా చేయాల్సి ఉంది. లెక్కప్రకారం, ఆర్-ఆర్-ఆర్ తర్వాత అదే సెట్స్ పైకి రావాలి. కానీ మైత్రీ-చరణ్ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఇది ఫిక్స్.

First Published:  28 May 2019 8:30 PM GMT
Next Story