ప్రియా వారియర్ కి షాకిచ్చిన మరో హీరోయిన్

ప్రియా ప్రకాష్ వారియర్.. ఒక్క వీడియో తో దేశం మొత్తం పాపులర్ అయిపోయిన ఈ మలయాళీ ముద్దు గుమ్మ ప్రస్తుతం అవకాశాల్లేక ఖాళీ గా ఉంది.

ఓరు ఆదార్ లవ్ అనే చిత్రం తో హీరోయిన్ గా సినిమా రంగ ప్రవేశం చేసిన ఈమె కి మొదటి సినిమా కలిసి రాలేదు. అటు మలయాళం లో, ఇటు తెలుగు లో ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. అంతే కాకుండా సినిమా విడుదల అయ్యాక అందరూ ప్రియా వారియర్ ని వివాదం లో కి లాగారు.

దర్శకుడు కూడా ప్రియ కి వ్యతిరేకం గా మాట్లాడటం తో ప్రియా చుట్టూ చాలా నెగటివ్ బజ్ తయారు అయింది. అయితే ఈ సినిమా లో ప్రియా తో పాటు నోరిన్ షెరీఫ్ అనే మరో అమ్మాయి కూడా నటించింది. ఈవిడ కూడా సినిమా ప్రచారాల్లో ఎక్కువ గా పాల్గొంది. కానీ ప్రియా కి వచ్చిన క్రేజ్ మాత్రం మారే హీరోయిన్ కి రాలేదు. అయితే ఈ సందర్భం గా తెలుగు సినిమా లోకి త్వరలో నోరిన్ ప్రవేశిస్తుంది. ఇది ప్రియా కి పెద్ద షాక్ అని చెప్పచ్చు.

సినిమా విడుదల అయ్యాక తనకి అవకాశాలు వస్తాయి అనుకుంటే తనకంటే చిన్న పాత్ర వేసిన నోరిన్ ని ఒక తెలుగు ప్రముఖ నిర్మాణ సంస్థ అప్రోచ్ అవడం ఇప్పుడు ప్రియా కి మింగుడు పడడం లేదు అని టాక్.