ప్రేమ వివాహానికి సై అంటున్న రాజ్ తరుణ్

ఉయ్యాలా జంపాలా సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో కి అడుగుపెట్టిన హీరో రాజ్ తరుణ్. మొదటి సినిమా తో నే అందరి మన్ననలు పొంది ఆ తర్వాత హీరోగా కంటిన్యూ అయ్యాడు. చేసినవి తక్కువ చిత్రాలు అయినా అందులో కొన్ని మాత్రమే అందరినీ మెప్పించాయి.

ఇటీవల వరుసగా తరుణ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేకపోయాయి. ఇక పోతే ఈ హీరో సోషల్ మీడియా లో తరచుగా అభిమానుల తో యాక్టివ్ గా ఉంటాడు.

అప్పుడప్పుడు వాళ్ళ తో సంభాషణలు చేస్తూ వారు అడిగే ప్రశ్నలకి సమాధానం ఇస్తూ ఉంటాడు.

ఒకప్పుడు రాజ్ తరుణ్ తాను ప్రేమ వివాహం చేసుకుంటాను అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక అభిమాని ఆ విషయాన్నీ రాజ్ వద్ద ప్రస్తావిస్తూ వివాహానికి సంబందించిన వార్త ఎప్పుడు చెప్తారు అని అడుగగా, రాజ్ తరుణ్ సానుకూలం గా స్పందించాడు. త్వరలో తన వివాహానికి సంబందించిన ప్రకటన చేస్తాను అని రాజ్ తరుణ్ చెప్పడం తో ఈ వార్త ప్రస్తుతం వైరల్ అయింది.

దిల్ రాజు నిర్మాణం లో త్వరలో ఒక సినిమా చేయనున్న రాజ్, ఆ సినిమా అయిన అనంతరమే వివాహం చేసుకోనున్నాడట.