Telugu Global
NEWS

టీడీఎల్పీలో వాడి వేడి చర్చ.. చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక..!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండనని.. ఎవరినైనా కొత్త వారిని ఎన్నుకుందామని సన్నిహితులతో అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తొలి సారిగా తెలుగుదేశం లెజిస్లేటీవ్ పార్టీ సమావేశం జరిగింది. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలుగా అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌ల పేర్లు చర్చకు వచ్చాయి. […]

టీడీఎల్పీలో వాడి వేడి చర్చ.. చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక..!
X

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండనని.. ఎవరినైనా కొత్త వారిని ఎన్నుకుందామని సన్నిహితులతో అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తొలి సారిగా తెలుగుదేశం లెజిస్లేటీవ్ పార్టీ సమావేశం జరిగింది.

ఇటీవల ఎన్నికల్లో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలుగా అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌ల పేర్లు చర్చకు వచ్చాయి. చంద్రబాబు తనకు ఆసక్తి లేదని తెలిపారు. కాని చంద్రబాబే ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని ఎమ్మెల్యేలంతా పట్టుబట్టారట. దీంతో ఆయన టీడీఎల్పీ నాయకుడిగా ఉండటానికి అంగీకరించారని చెబుతున్నారు.

ఇదే భేటీలో పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ పరిస్థితిపై గతంలో తాను ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారట. మనల్ని ఈవీఎంలు ముంచాయా.. లేక నేల విడిచి సాము చేశామా అనేది విశ్లేషించుకోవాలని ఆయన హితవు పలికారట. కాగా, ఈ కష్టకాలంలో పార్టీని చంద్రబాబు ముందుండి నడిపించాలని ఆయన కోరారట.

ఇక మండలిలో టీడీపీకి 34 మంది ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అక్కడ టీడీపీ పక్ష నేతగా లోకేష్, యనమల రామకృష్ణుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్లు పరిశీలిస్తున్నారు.

అయితే లోకేష్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి విముఖత చూపినట్లు తెలిస్తోంది. కాగా, శాసన సభలో బీసీ వర్గానికి ఉప నేత హోదా కేటాయించి.. ఎస్సీ వర్గానికి శాసన మండలిలో ప్రతిపక్ష నేత పదవి ఇవ్వాలని అనుకున్నట్లు తెలుస్తోంది.

First Published:  29 May 2019 1:29 AM GMT
Next Story