Telugu Global
Cinema & Entertainment

క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేశ్

ఏపీ ఎన్నికల్లో ఓడిపోయిన పవన్ కల్యాణ్, తిరిగి సినిమాల్లోకి వెళ్తారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ ప్రచారం కొత్త పుంతలు తొక్కింది. పవన్ భక్తుడు బండ్ల గణేశ్ నిర్మాతగా ఆ సినిమా రాబోతోందంటూ 2 రోజులుగా పుకార్లు వచ్చాయి. వీటిపై స్వయంగా బండ్ల గణేశ్ రియాక్ట్ అయ్యాడు. ఈరోజు ట్విట్టర్ లో స్పందించిన బండ్ల.. పవన్ పేరు ప్రస్తావించకుండా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన బ్యానర్ పై ప్రస్తుతానికి ఏ సినిమా ఫైనలైజ్ […]

క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేశ్
X

ఏపీ ఎన్నికల్లో ఓడిపోయిన పవన్ కల్యాణ్, తిరిగి సినిమాల్లోకి వెళ్తారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ ప్రచారం కొత్త పుంతలు తొక్కింది. పవన్ భక్తుడు బండ్ల గణేశ్ నిర్మాతగా ఆ సినిమా రాబోతోందంటూ 2 రోజులుగా పుకార్లు వచ్చాయి. వీటిపై స్వయంగా బండ్ల గణేశ్ రియాక్ట్ అయ్యాడు.

ఈరోజు ట్విట్టర్ లో స్పందించిన బండ్ల.. పవన్ పేరు ప్రస్తావించకుండా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన బ్యానర్ పై ప్రస్తుతానికి ఏ సినిమా ఫైనలైజ్ అవ్వలేదని, ఏదైనా సినిమా ఓకే అయితే తను వెంటనే ప్రకటిస్తానని రాసుకొచ్చాడు. అంటే.. పవన్ తో తను సినిమా చేయడం లేదని పరోక్షంగా చెప్పాడన్నమాట.

మరోవైపు పవన్ వద్ద ఇప్పటికే కొన్ని అడ్వాన్స్ లు ఉన్నాయి. వీటిలో అతిపెద్ద అడ్వాన్స్ మైత్రీ మూవీ మేకర్స్ ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఎన్నికల అఫిడవిట్ లో కూడా చూపించాడు పవన్. సో.. మళ్లీ సినిమా చేయాల్సి వస్తే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే పవన్ సినిమా చేయాల్సి ఉంటుంది. ఈ బ్యానర్ పై సినిమా చేసిన తర్వాతే మరో బ్యానర్ గురించి ఆలోచించాలి.

సో.. పవన్-బండ్ల కాంబోలో సినిమా అనేది అవాస్తవమని తేలిపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా తను సినిమాల్లోకి మళ్లీ రానని పవన్ రీసెంట్ గా ప్రకటించారు. మరోవైపు నాగబాబు కూడా అదే విషయాన్ని రిపీట్ చేశాడు. కానీ పవన్ రీఎంట్రీపై ఎప్పటికప్పుడు ఇలా పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఈ గాసిప్స్ ఆగిపోవాలంటే పవన్ మరోసారి ప్రజల్లోకి రావాల్సిందే. ‘

First Published:  29 May 2019 9:25 PM GMT
Next Story