Telugu Global
Cinema & Entertainment

దొరసాని వచ్చేసింది

రాజశేఖర్ చిన్నకూతురు శివాత్మిక హీరోయిన్ గా పరిచయం అవుతున్న సినిమా ఇది. అటు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్న సినిమా కూడా ఇదే. అందుకే దొరసాని అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. పైగా ఎలాంటి హైప్ ఇవ్వకుండా, అంచనాలు పెంచకుండా సినిమా కథను ముందే చెప్పేయడం అందరికీ నచ్చింది. అలా నలుగురి నోళ్లల్లో నానుకున్న దొరసాని సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది. దొరసానిగా శివాత్మిక, దళిత కుర్రాడు రాజుగా ఆనంద్ దేవరకొండ […]

దొరసాని వచ్చేసింది
X

రాజశేఖర్ చిన్నకూతురు శివాత్మిక హీరోయిన్ గా పరిచయం అవుతున్న సినిమా ఇది. అటు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్న సినిమా కూడా ఇదే. అందుకే దొరసాని అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. పైగా ఎలాంటి హైప్ ఇవ్వకుండా, అంచనాలు పెంచకుండా సినిమా కథను ముందే చెప్పేయడం అందరికీ నచ్చింది. అలా నలుగురి నోళ్లల్లో నానుకున్న దొరసాని సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది.

దొరసానిగా శివాత్మిక, దళిత కుర్రాడు రాజుగా ఆనంద్ దేవరకొండ ఫస్ట్ లుక్ లో అందంగా కనిపించారు. వీళ్లిద్దరి మధ్య ప్రేమకథతో తెరకెక్కిన సినిమానే ఈ దొరసాని. 1980ల నాటి తెలంగాణ యధార్థ కథాంశం ఇది. దీనికి కాస్త ఫిక్షన్ జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. కారులో కూర్చున్న దొరసానిని ఆ పక్కనే సైకిల్ పై వచ్చిన హీరో ఆరాధనగా చూస్తున్నట్టుగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ ఒక రకంగా కథలోని ఆత్మను చెబుతోంది.

ఈ సినిమాతో మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నాడు. మధుర ఎంటర్ టైన్ మెంట్స్, బిగ్ బెన్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ బాబు సమర్పిస్తున్నారు. వచ్చేనెల 6న దొరసాని టీజర్ ను విడుదల చేయబోతున్నారు.

First Published:  30 May 2019 10:45 AM GMT
Next Story