Telugu Global
Cinema & Entertainment

విడుదలైన సినిమాను రీమేక్ చేస్తున్నారు....

ఇప్పుడు టెంపర్ సినిమా ని తమిళం లో అయోగ్య పేరు తో రీమేక్ చేశారు. అయితే తెలుగు సినిమా అయిన టెంపర్ ని తమిళం లో రీమేక్ చేయడం బాగానే ఉంది కానీ ఈ తమిళ సినిమా ని మళ్ళీ అదే పేరు తో తెలుగు లో కి డబ్ చేస్తుండడం అందరినీ షాక్ కి గురి చేసింది. తెలిసిన కథ నే మళ్ళీ ఇంకోసారి విడుదల చేయడం వలన నష్టాలు వచ్చే అవకాశం ఉంది అని […]

విడుదలైన సినిమాను రీమేక్ చేస్తున్నారు....
X

ఇప్పుడు టెంపర్ సినిమా ని తమిళం లో అయోగ్య పేరు తో రీమేక్ చేశారు. అయితే తెలుగు సినిమా అయిన టెంపర్ ని తమిళం లో రీమేక్ చేయడం బాగానే ఉంది కానీ ఈ తమిళ సినిమా ని మళ్ళీ అదే పేరు తో తెలుగు లో కి డబ్ చేస్తుండడం అందరినీ షాక్ కి గురి చేసింది.

తెలిసిన కథ నే మళ్ళీ ఇంకోసారి విడుదల చేయడం వలన నష్టాలు వచ్చే అవకాశం ఉంది అని కొందరి వాదన. అయితే ఇప్పుడు ఇదే తరహాలో తమిళం లో విడుదల అయి తెలుగు లో కి డబ్ అయిన ఒక సినిమా ని తెలుగు లో రీమేక్ చేయాలి అనుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే తమిళం లో శివకార్తికేయన్ హీరోగా వచ్చిన “కేడి బిల్లా – కిలాడి రంగా” అనే చిత్రం అక్కడ పెద్ద విజయం సాధించింది. పాండిరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో రెజీనా-బిందు మాధవి హీరోయిన్లుగా నటించారు. విమల్ ఒక హీరో పాత్ర చేశారు.

అయితే ఈ సినిమా ని తెలుగు లో కి కూడా డబ్ చేసి విడుదల చేశారు. చూసిన వాళ్ళు చూసారు కానీ పెద్దగా ఆడలేదు. ఈ సినిమా యూట్యూబ్ లో కూడా అందుబాటు లో ఉంది అని వినికిడి.

అయితే ఇప్పుడు ఈ సినిమా ని నాగ శౌర్య మరియు శ్రీనివాస్ అవసరాలని పెట్టి తెలుగులో రీమేక్ చేయాలని ఒక నిర్మాణ సంస్థ భావిస్తుందట. కానీ ఆల్రెడీ తెలుగు లో విడుదల అయిన ఈ సినిమా ని ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి.

First Published:  29 May 2019 11:52 PM GMT
Next Story