Telugu Global
Cinema & Entertainment

మళ్లీ సంక్రాంతి బరిలోకి దిగనున్న నాగార్జున

మామూలుగానే సంక్రాంతి అంటే సినిమాల పండుగలా ఉంటుంది. అయితే వచ్చే ఏడాది మాత్రం సంక్రాంతి సినిమాల హంగామా మరింత ఎక్కువ కాబోతోంది. ఇప్పటికే అరడజనుకు పైగా పెద్ద సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్నాయి. తాజాగా ఈ లిస్టులో మరో సినిమా కూడా జాయిన్ అయింది. అదే ‘బంగార్రాజు’ సినిమా. నాగార్జున హీరోగా సూపర్ హిట్ అయిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా కి ప్రీక్వెల్ గా ‘బంగార్రాజు’ సినిమా తెరకెక్కనుంది. ‘సోగ్గాడే చిన్నినాయన’ కి దర్శకత్వం వహించిన […]

మళ్లీ సంక్రాంతి బరిలోకి దిగనున్న నాగార్జున
X

మామూలుగానే సంక్రాంతి అంటే సినిమాల పండుగలా ఉంటుంది. అయితే వచ్చే ఏడాది మాత్రం సంక్రాంతి సినిమాల హంగామా మరింత ఎక్కువ కాబోతోంది.

ఇప్పటికే అరడజనుకు పైగా పెద్ద సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్నాయి. తాజాగా ఈ లిస్టులో మరో సినిమా కూడా జాయిన్ అయింది. అదే ‘బంగార్రాజు’ సినిమా.

నాగార్జున హీరోగా సూపర్ హిట్ అయిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా కి ప్రీక్వెల్ గా ‘బంగార్రాజు’ సినిమా తెరకెక్కనుంది. ‘సోగ్గాడే చిన్నినాయన’ కి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ ‘బంగార్రాజు’కి కూడా దర్శకత్వం వహించబోతున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఆగస్టు లో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ కల్లా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారట. నిజానికి ‘సోగ్గాడే చిన్ని నాయన’ కూడా సంక్రాంతి సందర్భంగా నే విడుదలై బ్లాక్ బస్టర్ గా మారింది.

అందుకే ‘బంగార్రాజు’ సినిమా కూడా అలానే హిట్ అవుతుందని చిత్రబృందం భావిస్తోంది. అయితే ‘బంగార్రాజు’ సినిమాకి మాత్రం కాంపిటేషన్ బాగా ఉండబోతోంది.

రజనీకాంత్ ‘దర్బార్’, ప్రభాస్ 20, మహేష్ 26, ‘భారతీయుడు 2’ మొదలగు పెద్ద సినిమాలు కూడా సంక్రాంతి బరిలోకి దిగనున్నాయి.

First Published:  30 May 2019 2:03 AM GMT
Next Story