Telugu Global
Cinema & Entertainment

ఎన్జీకే కోసం 18 ఏళ్లు వెయిట్ చేశాడట

దర్శకుడు సెల్వ రాఘవన్, సూర్య కాంబినేషన్ లో ఎట్టకేలకు సినిమా ముస్తాబైంది. వీళ్లిద్దరి కాంబోలో ఎన్జీకే అనే సినిమా సిద్ధమైంది. ఈ మూవీ కోసం 18 ఏళ్లుగా ఎదురుచూశానంటున్నాడు సూర్య. సెల్వ రాఘవన్ (శ్రీరాఘవ) అంటే తనకు ఎంతో ఇష్టమని, అలాంటి సెన్సిబుల్ దర్శకుడితో సినిమా చేస్తే అది కచ్చితంగా హిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఇన్నాళ్లు ఆగానని చెప్పుకొచ్చాడు. నిజానికి శ్రీరాఘవ, సూర్య మధ్య చాలాసార్లు కథాచర్చలు జరిగాయి. వీళ్లిద్దరి కాంబోలో సినిమా ఫిక్స్ అయిందనుకున్న ప్రతిసారి […]

ఎన్జీకే కోసం 18 ఏళ్లు వెయిట్ చేశాడట
X

దర్శకుడు సెల్వ రాఘవన్, సూర్య కాంబినేషన్ లో ఎట్టకేలకు సినిమా ముస్తాబైంది. వీళ్లిద్దరి కాంబోలో ఎన్జీకే అనే సినిమా సిద్ధమైంది. ఈ మూవీ కోసం 18 ఏళ్లుగా ఎదురుచూశానంటున్నాడు సూర్య. సెల్వ రాఘవన్ (శ్రీరాఘవ) అంటే తనకు ఎంతో ఇష్టమని, అలాంటి సెన్సిబుల్ దర్శకుడితో సినిమా చేస్తే అది కచ్చితంగా హిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఇన్నాళ్లు ఆగానని చెప్పుకొచ్చాడు.

నిజానికి శ్రీరాఘవ, సూర్య మధ్య చాలాసార్లు కథాచర్చలు జరిగాయి. వీళ్లిద్దరి కాంబోలో సినిమా ఫిక్స్ అయిందనుకున్న ప్రతిసారి అది కార్యరూపం దాల్చకుండానే తెరమరుగైపోయేది. గతంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా టైమ్ నుంచి వీళ్లిద్దరి మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఎన్జీకే సినిమా వద్ద ఆ చర్చలు ఆగాయి. అందుకే ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకం అంటున్నాడు సూర్య.

నిజమే.. సూర్యకు మాత్రమే కాదు అతడి అభిమానులు, ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా ప్రత్యేకంగా మారింది. ఇన్నాళ్లు వెయిట్ చేయించి, శ్రీరాఘవ దర్శకత్వంలో సూర్య చేసిన ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులకు కూడా ఉంది. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా 31న థియేటర్లలోకి వస్తోంది ఎన్జీకే సినిమా. ఇంతకీ ఎన్జీకే అంటే ఏంటో తెలుసా? నందగోపాలకృష్ణ. సినిమాలో హీరో పాత్ర పేరు ఇదే.

First Published:  29 May 2019 9:21 PM GMT
Next Story