తెలివిగా సమాధానం ఇచ్చిన రకుల్

తెలుగు సినిమా పరిశ్రమ లో ఉన్న టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ కూడా ఒకరు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో ఫామ్ లో కి వచ్చిన ఈ నటి తర్వాత అనేక మంది టాప్ హీరోల తో జత కట్టి మెల్ల మెల్లగా బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

అయితే ఇటీవల కాలం లో ఆమె నుండి తెలుగు సినిమాలు పెద్దగా ఏమి రాలేదు. చాలా రోజుల నుండి తెలుగు సినిమా పరిశ్రమ కి దూరం గా ఉంది రకుల్. ప్రస్తుతం తన చేతిలో మన్మధుడు 2 సినిమా మాత్రమే ఉంది. ఇదే విషయాన్ని రకుల్ దగ్గర ప్రస్తావించగా ఆవిడ టాపిక్ ని బాగా డైవర్ట్ చేస్తూ తెలివి గా సమాధానం ఇచ్చింది.

“దానికి పెద్దగా కారణం ఏమి లేదు. సంవత్సరం లో 365 రోజులు మాత్రమే ఉంటాయి. వివిధ భాషల్లో పని చేస్తూ ఉన్నప్పుడు ఈ గ్యాప్ అనేది చాలా కామన్. ఈ సంవత్సరం నా నుండి ఆరు సినిమాలు ఉంటాయి. అందులో తెలుగు, తమిళ, హిందీ సినిమాలు కూడా ఉంటాయి.” అని రకుల్ ప్రీత్ చెప్పుకొచ్చింది. ఈమె ప్రస్తుతం సూర్య తో ఎన్జీకె అనే సినిమా ప్రచారం లో బిజీ గా ఉంది.