Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి సరసన జెర్సీ భామ? 

నాని హీరోగా ఇటీవలే జెర్సీ అనే సినిమా విడుదల అయ్యి పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా తో శ్రద్ధ శ్రీనాథ్ అనే కన్నడ నటి తెలుగు లో పరిచయం అయింది. జెర్సీ కి ముందే రెండు తెలుగు సినిమాలని కంప్లీట్ చేసుకున్న శ్రద్ధ కి టెక్నీకల్ గా జెర్సీ ముందు విడుదల అయింది కాబట్టే ఈ సినిమా అరంగేట్రం గా అందరూ చెప్తున్నారు. ఇక ఈ సినిమా లో సారా అనే పాత్ర ను చేసిన […]

చిరంజీవి సరసన జెర్సీ భామ? 
X

నాని హీరోగా ఇటీవలే జెర్సీ అనే సినిమా విడుదల అయ్యి పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా తో శ్రద్ధ శ్రీనాథ్ అనే కన్నడ నటి తెలుగు లో పరిచయం అయింది. జెర్సీ కి ముందే రెండు తెలుగు సినిమాలని కంప్లీట్ చేసుకున్న శ్రద్ధ కి టెక్నీకల్ గా జెర్సీ ముందు విడుదల అయింది కాబట్టే ఈ సినిమా అరంగేట్రం గా అందరూ చెప్తున్నారు.

ఇక ఈ సినిమా లో సారా అనే పాత్ర ను చేసిన శ్రద్ధ విమర్శకులని, ప్రేక్షకులని, ఇండస్ట్రీ వాళ్ళని అందరినీ మెప్పించింది. తన పాత్ర లో ఉన్న రెండు వేరియేషన్స్ ని చాలా చక్కగా చూపెట్టి అందరి దృష్టి లో పడింది.

అయితే తాజా సమాచారం మేరకు శ్రద్ధ మెగా స్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. సై రా నరసింహా రెడ్డి పూర్తి కాగానే చిరంజీవి కొరటాల శివ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు అని టాక్.

అయితే శ్రద్ధ నటన మెచ్చి కొరటాల ఈ సినిమా లో రెండో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నాడట.

ఈ సినిమా ని కూడా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ పై న నిర్మించనున్నారు.

First Published:  29 May 2019 9:02 PM GMT
Next Story