Telugu Global
NEWS

ప్రపంచకప్ వ్యాఖ్యాతల జట్టులో సౌరవ్ గంగూలీ

హర్షా బోగ్లే, సంజయ్ మంజ్రేకర్ కూ అవకాశం కామెంటీటర్ల జట్టులో 24 మంది వ్యాఖ్యాతలు ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా…మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీ ప్రత్యక్ష ప్రసారానికి.. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ నెట్ వర్క్ విస్త్రుత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. మే 30 నుంచి జులై 14 వరకూ…11 వేదికల్లో 46 రోజులపాటు 48 మ్యాచ్ లుగా సాగే ఈ టోర్నీ కోసం…మొత్తం 10 దేశాలకు చెందిన 24 మంది కామెంటీటర్ల జట్టును […]

ప్రపంచకప్ వ్యాఖ్యాతల జట్టులో సౌరవ్ గంగూలీ
X
  • హర్షా బోగ్లే, సంజయ్ మంజ్రేకర్ కూ అవకాశం
  • కామెంటీటర్ల జట్టులో 24 మంది వ్యాఖ్యాతలు

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా…మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీ ప్రత్యక్ష ప్రసారానికి.. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ నెట్ వర్క్ విస్త్రుత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.

మే 30 నుంచి జులై 14 వరకూ…11 వేదికల్లో 46 రోజులపాటు 48 మ్యాచ్ లుగా సాగే ఈ టోర్నీ కోసం…మొత్తం 10 దేశాలకు చెందిన 24 మంది కామెంటీటర్ల జట్టును స్టార్ నెట్ వర్క్ ఎంపిక చేసింది.

భారత్ నుంచి దాదా, మంజ్రేకర్, బోగ్లే…

మొత్తం 24 మంది ప్రపంచకప్ కామెంటీటర్ల బృందంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, సంజయ్ మంజ్రేకర్, హర్షా బోగ్లే చోటు దక్కించుకొన్నారు.

10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ కమ్ సెమీఫైనల్స్ నాకౌట్ గా జరిగే ఈ పోటీల ఇతర వ్యాఖ్యాతలలో…మైకేల్ క్లార్క్, మైకేల్ స్లేటర్, వసీం అక్రం, రమీజ్ రాజా, కుమార సంగక్కర, పామీ ఎంబాగ్వా, అతర్ అలీ ఖాన్, మైకేల్ హోల్డింగ్, ఇయాన్ బిషప్, మైకేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్, ఇయాన్ వార్డ్, సైమన్ డూల్, ఇయాన్ స్మిత్, బ్రెండన్ మెకల్లమ్, గ్రీమ్ స్మిత్ ,షాన్ పోలాక్ ఉన్నారు.

ముగ్గురు మహిళా కామెంటీటర్లు…

క్రికెట్ వ్యాఖ్యాతల బృందంలో ముగ్గురు మహిళా మాజీ క్రికెటర్లకు సైతం చోటు దక్కింది. ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఇషా గుహ, మెల్ జోన్స్, అలీసన్ మిషెల్ ఉన్నారు.

ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్..లండన్ లోని ఓవల్ స్టేడియం వేదికగా మే 30న ప్రారంభమవుతుంది. తొలిరోజున జరిగే మొదటి మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లండ్ తో సౌతాఫ్రికా, ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగే రెండోమ్యాచ్ లో పాకిస్థాన్ తో వెస్టిండీస్ తలపడతాయి.

ఆరువారాలపాటు సాగే ఈ టోర్నీ ని ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మంది వీక్షించే అవకాశం ఉందని నిర్వాహక సంఘం అంచనా వేస్తోంది.

First Published:  30 May 2019 1:15 AM GMT
Next Story