Telugu Global
Cinema & Entertainment

ఫ్లాప్ ను మరిచిపోయే ప్రయత్నం

దర్శకుడు తేజ అంతే. సినిమా తీయడం వరకే అతడి పని. అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా పట్టించుకోడు. ఇప్పుడు మరోసారి అదే పద్ధతి ఫాలో అవుతున్నాడు తేజ. బెల్లంకొండ-కాజల్ హీరోహీరోయిన్లుగా సీత సినిమా తీశాడు తేజ. ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయింది. దీనిపై చాలానే విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా తేజ టేకింగ్ పై చాలా విమర్శలు చెలరేగాయి. వాటన్నింటినీ ప్రస్తుతం పట్టించుకోవడం మానేశాడు తేజ. దాదాపు అన్ని రివ్యూస్ చదివిన తేజ, మొన్నటివరకు […]

ఫ్లాప్ ను మరిచిపోయే ప్రయత్నం
X

దర్శకుడు తేజ అంతే. సినిమా తీయడం వరకే అతడి పని. అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా పట్టించుకోడు. ఇప్పుడు మరోసారి అదే పద్ధతి ఫాలో అవుతున్నాడు తేజ. బెల్లంకొండ-కాజల్ హీరోహీరోయిన్లుగా సీత సినిమా తీశాడు తేజ. ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయింది. దీనిపై చాలానే విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా తేజ టేకింగ్ పై చాలా విమర్శలు చెలరేగాయి.

వాటన్నింటినీ ప్రస్తుతం పట్టించుకోవడం మానేశాడు తేజ. దాదాపు అన్ని రివ్యూస్ చదివిన తేజ, మొన్నటివరకు సమీక్షకులపై విరుచుకుపడ్డాడు. రివ్యూలు రాయడం రాదంటూ ఎద్దేవా చేశాడు. తన సినిమాకు 3 కంటే ఎక్కువ రేటింగ్ ఇవ్వొద్దని సెటైర్లు వేశాడు. 3 కంటే ఎక్కువ రేటింగ్ ఇచ్చిన సినిమాలు ఈమధ్య ఫ్లాప్ అయ్యాయని, అందుకే తన సినిమాకు 3 కంటే ఎక్కువ రేటింగ్ ఇవ్వొద్దంటూ మీడియానే కామెంట్స్ చేశాడు. అలా రిలీజైన ఓ వారం రోజుల పాటు విమర్శకులపై విరుచుకుపడిన తేజ, ఇప్పుడు మరో సినిమా పనిలో పడ్డాడు.

ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఓ కొత్త పాయింట్ తేజ వద్ద ఎప్పట్నుంచో ఉందట. కానీ ఆ సినిమాను చూసే స్థాయికి ఇంకా సమాజం ఎదగలేదట. ఇన్నాళ్లకు ఆ టైమ్ వచ్చిందంటున్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం టాలీవుడ్ కొత్త తరహా కథల్ని ఎంకరేజ్ చేస్తోంది కాబట్టి, తన వద్ద ఉన్న ఆ కొత్త పాయింట్ తో ఓ సినిమా చేస్తానంటున్నాడు. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేశాడు.

గతంలో చిత్రం లాంటి విభిన్నమైన సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేశాడు తేజ. ఆ సినిమా చాలా బోల్డ్ ఎటెంప్ట్. మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రయోగం ఏదైనా చేయబోతున్నాడేమో చూడాలి.

First Published:  30 May 2019 10:37 AM GMT
Next Story