Telugu Global
NEWS

సీఎం జగన్.... మరి క్యాబినెట్‌లో ఎవరు..?

సుదీర్ఘ పాదయాత్ర చేసి గత పదేళ్లుగా జనంతోనే మమేకమైన వైఎస్ జగన్‌కు ఏపీ ప్రజలు సీఎం పదవిని కానుకగా ఇచ్చారు. నిన్న విజయవాడలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పుడు ఆయన మంత్రి వర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందా అన్న చర్చ జరుగుతోంది. జగన్ సన్నిహితులకు, స్నేహితులకు, బంధువులకు, పాదయాత్రలో ప్రామిస్ చేసిన వారికి అంటూ అనేక పేర్లు వినిపిస్తున్నాయి. జూన్ 8న కేబినెట్ విస్తరణ జరుగుతోందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి […]

సీఎం జగన్.... మరి క్యాబినెట్‌లో ఎవరు..?
X

సుదీర్ఘ పాదయాత్ర చేసి గత పదేళ్లుగా జనంతోనే మమేకమైన వైఎస్ జగన్‌కు ఏపీ ప్రజలు సీఎం పదవిని కానుకగా ఇచ్చారు. నిన్న విజయవాడలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పుడు ఆయన మంత్రి వర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందా అన్న చర్చ జరుగుతోంది. జగన్ సన్నిహితులకు, స్నేహితులకు, బంధువులకు, పాదయాత్రలో ప్రామిస్ చేసిన వారికి అంటూ అనేక పేర్లు వినిపిస్తున్నాయి.

జూన్ 8న కేబినెట్ విస్తరణ జరుగుతోందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. మరో వారం రోజులే సమయం ఉండటంతో క్యాబినెట్ పదవులను ఆశించే వారి పేర్లు భారీగానే ఉన్నాయి. మరి వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో అర్థం కావడం లేదు.

ఏపీలోని 13 జిల్లాల వారీగా మంత్రి పదవులు ఆశిస్తోంది వీరే..

శ్రీకాకుళం:
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు(శ్రీకాకుళం), కళావతి (పాలకొండ), రెడ్డి శాంతి (పాతపట్నం).

విజయనగరం:
బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), పుష్ప శ్రీవాణి(కురుపాం), రాజన్నదొర(సాలూరు).

విశాఖపట్నం:
గుడివాడ అమరనాధ్‌(అనకాపల్లి), గొర్లె బాబూరావు(పాయకరావుపేట), ముత్యాలనాయుడు(మాడుగుల).

తూర్పుగోదావరి:
సుభాష్‌ చంద్రబోస్‌(ఎమ్మెల్సీ కోటా), కన్నబాబు(కాకినాడ రూరల్‌), దాడిశెట్టి రాజా(తుని).

పశ్చిమగోదావరి:
ఆళ్ల నాని(ఏలూరు), తెల్లం బాలరాజు(పోలవరం), తానేటి వనిత(కొవ్వూరు), గ్రంథి శ్రీనివాస్‌ (భీమవరం).

కృష్ణా:
పేర్ని నాని(మచిలీపట్నం), ఉదయభాను(జగ్గయ్యపేట), పార్థసారథి(పెనమలూరు), మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు(నూజివీడు).

గుంటూరు:
ఆళ్ల రామకృష్ణారెడ్డి(మంగళగిరి), మర్రి రాజశేఖర్‌(ఎమ్మెల్సీ కోటా), అంబటి రాంబాబు(సత్తెనపల్లి), కోన రఘుపతి(బాపట్ల).

ప్రకాశం:
బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), ఆదిమూలపు సురేష్‌(యర్రగొండపాలెం).

నెల్లూరు:
మేకపాటి గౌతంరెడ్డి(ఆత్మకూరు), రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి(కావలి), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి).

చిత్తూరు:
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పుంగనూరు), కరుణాకర్‌రెడ్డి(తిరుపతి), రోజా(నగరి).

కడప:
శ్రీకాంత్‌రెడ్డి(రాయచోటి), అంజాద్‌ బాషా(కడప).

కర్నూలు:
బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి(డోన్‌), శ్రీదేవి(పత్తికొండ), హఫీజ్‌ఖాన్‌ (కర్నూలు).

అనంతపురం:
అనంత వెంకట్రామిరెడ్డి(అనంతపురం), కాపు రామచంద్రారెడ్డి(రాయదుర్గం), శంకర్‌నారాయణ(పెనుగొండ)

First Published:  31 May 2019 7:04 AM GMT
Next Story