Telugu Global
NEWS

ప్రపంచకప్ లో ఇంగ్లండ్ బోణీ

సౌతాఫ్రికాపై 104 పరుగుల భారీవిజయం 200 మ్యాచ్ ల క్లబ్ లో ఓయిన్ మోర్గాన్  నేడు పాక్ తో వెస్టిండీస్ సమరం 2019 వన్డే ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ లో…హాట్ ఫేవరెట్, ఆతిథ్య ఇంగ్లండ్ కళ్లు చెదిరే విజయంతో శుభారంభం చేసింది. లండన్ లోని ఓవల్ మైదానంలో జరిగిన 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ తొలిమ్యాచ్ లో…సౌతాఫ్రికాను 104 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న సౌతాఫ్రికాజట్టు..పవర్ […]

ప్రపంచకప్ లో ఇంగ్లండ్ బోణీ
X
  • సౌతాఫ్రికాపై 104 పరుగుల భారీవిజయం
  • 200 మ్యాచ్ ల క్లబ్ లో ఓయిన్ మోర్గాన్
  • నేడు పాక్ తో వెస్టిండీస్ సమరం

2019 వన్డే ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ లో…హాట్ ఫేవరెట్, ఆతిథ్య ఇంగ్లండ్ కళ్లు చెదిరే విజయంతో శుభారంభం చేసింది.
లండన్ లోని ఓవల్ మైదానంలో జరిగిన 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ తొలిమ్యాచ్ లో…సౌతాఫ్రికాను 104 పరుగుల తేడాతో
చిత్తు చేసింది.

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న సౌతాఫ్రికాజట్టు..పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ కలిగిన ఇంగ్లండ్ ను
ఏమాత్రం అదుపు చేయలేకపోయింది.

ఓపెనర్ జేసన్ రాయ్, కెప్టెన్ వోయిన్ మోర్గాన్, వన్ డౌన్ జో రూట్ హాఫ్ సెంచరీలు బాదగా…ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 89 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 311 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది.

ఇమ్రాన్ తాహీర్ రికార్డు..

44 సంవత్సరాల ప్రపంచకప్ చరిత్రలో…కొత్త బంతితో మ్యాచ్ ప్రారంభంలోనే తొలిబంతి వేసిన స్పిన్నర్‌ గా సౌతాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ రికార్డుల్లో చేరాడు. అంతేకాదు…తొలి ఓవర్లలోనే ఇంగ్లండ్ ఓపెనర్ బెయిర్ స్టోను డకౌట్ గా పడగొట్టాడు.

సఫారీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు, తాహీర్ , రబాడా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

బెన్ స్టోక్స్ మ్యాజిక్…

312 పరుగుల భారీ లక్ష్య సాధనతో చేజింగ్ కు దిగిన సఫారీటీమ్ 39.5 ఓవర్లలో 207 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ జోఫ్రా ఆర్చర్ దెబ్బ మీద దెబ్బ కొడుతూ సౌతాఫ్రికాను కోలుకోనివ్వకుండా చేశాడు.

డాషింగ్ ఓపెనర్ డి కాక్ 68, యువఆటగాడు డ్యూసెన్ 50 పరుగులు మినహా మిగిలిన టాపార్డర్ ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు.

ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లు, ప్లంకెట్, బెన్ స్టోక్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఫీల్డింగ్ లో కళ్లు చెదిరే క్యాచ్ తో మ్యాజిక్ చేసిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ విజయంతో ఇంగ్లండ్ రెండు పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ అగ్రస్థానంలో నిలిచింది.

First Published:  30 May 2019 9:00 PM GMT
Next Story