క‌మ‌లం వైపు తెలంగాణ త‌మ్ముళ్ల చూపులు !

ఏపీలోనే కాదు…. తెలంగాణ‌లో కూడా త‌మ్ముళ్లు మారిపోయారు. రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం ప‌క్క చూపులు చూస్తున్నారు. తెలుగుదేశంలో ఉంటే ఇక భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని డిసైడ్ అయిన నేత‌లు బీజేపీ వైపు చూస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశంలో మిగ‌లిన నేత‌లు కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అయిపోతున్నారు.

తెలంగాణ‌లో 4 బీజేపీ ఎంపీ సీట్లు గెల‌వ‌డంతో బీజేపీ వైపు చూసే నేత‌ల సంఖ్య పెరిగిపోతోంది. బీజేపీలో చేరేందుకు ప‌లువురు పార్టీ నేత‌లు ఆస‌క్తి చూపుతున్నారు. కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్న కిష‌న్‌రెడ్డిని ప‌లువురు నేత‌లు క‌లుస్తున్నారు. తెలంగాణకు చెందిన టీడీపీ నేత‌లు పెద్దిరెడ్డి, చాడ సురేష్‌రెడ్డి… కిష‌న్‌రెడ్డిని క‌లిశారు. బీజేపీలో చేర‌తామ‌ని ఆయ‌న‌తో చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

వీళ్లిద్ద‌రే కాదు… ప‌లువురు టీడీపీ, కాంగ్రెస్ నేత‌లు కూడా బీజేపీ నేత‌ల ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ తెలుగుదేశం క్లోజ్ అయింద‌ని…. ఆ పార్టీలో భ‌విష్య‌త్ లేద‌ని డిసైడ్ అయిన నేత‌లు బీజేపీ వైపు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.