Telugu Global
Cinema & Entertainment

సైనికుడిగా మహేష్ బాబు

మహేష్ బాబు ఇప్పటికే సైనికుడు అనే సినిమా చేశాడు. కానీ అందులో అతడు సైనికుడు కాదు. కథ ప్రకారం టైటిల్ అలా పెట్టుకున్నారంతే. కానీ ఈసారి మాత్రం మహేష్ నిజంగానే సైనికుడిగా కనిపించబోతున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో మహేష్ పాత్ర ఇదే. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా రాత్రి, మహేష్ కొత్త సినిమా టైటిల్ లోగో విడుదల చేశారు. ఈ సినిమాకు సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ చూస్తే మహేష్ ఇందులో […]

సైనికుడిగా మహేష్ బాబు
X

మహేష్ బాబు ఇప్పటికే సైనికుడు అనే సినిమా చేశాడు. కానీ అందులో అతడు సైనికుడు కాదు. కథ ప్రకారం టైటిల్ అలా పెట్టుకున్నారంతే. కానీ ఈసారి మాత్రం మహేష్ నిజంగానే సైనికుడిగా కనిపించబోతున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో మహేష్ పాత్ర ఇదే.

కృష్ణ పుట్టినరోజు సందర్భంగా రాత్రి, మహేష్ కొత్త సినిమా టైటిల్ లోగో విడుదల చేశారు. ఈ సినిమాకు సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ చూస్తే మహేష్ ఇందులో మిలట్రీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడనే విషయం ఈజీగా అర్థమౌతోంది. కొద్దిసేపటి కిందట (8.15 గం.లకు) ఈ సినిమా అన్నపూర్ణ స్టుడియోస్ లో లాంఛనంగా ప్రారంభమైంది.

అనీల్ సుంకర, మహేష్ బాబు, దిల్ రాజు నిర్మాతలుగా సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఆ విషయాన్ని కూడా రాత్రి అధికారికంగా ప్రకటించారు. రష్మిక హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. విజయశాంతి, బండ్ల గణేశ్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించబోతున్నారు.

First Published:  30 May 2019 11:34 PM GMT
Next Story