Telugu Global
NEWS

డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్‌ సవాంగ్‌

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌ ఈరోజు ఉదయం బాధ్యతలు చేపట్టారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు‌. ఆయన 1986 ఐపీఎస్‌ బ్యాచ్‌ కేడర్‌ అధికారి. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ…‌. పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండేలా పోలీసుశాఖను పునరుద్దరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని… సీఎం కూడా పోలీసు వ్యవస్థలో పూర్తిస్థాయి సంస్కరణలు చేపట్టి ప్రజలకు చేరువ కావాలని ఆదేశాలిచ్చారన్నారు గౌతమ్‌ సవాంగ్. ఏపీ పోలీస్‌శాఖను దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతామన్నారు. గత పదేళ్ళలో […]

డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్‌ సవాంగ్‌
X

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌ ఈరోజు ఉదయం బాధ్యతలు చేపట్టారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు‌. ఆయన 1986 ఐపీఎస్‌ బ్యాచ్‌ కేడర్‌ అధికారి.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ…‌. పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండేలా పోలీసుశాఖను పునరుద్దరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని… సీఎం కూడా పోలీసు వ్యవస్థలో పూర్తిస్థాయి సంస్కరణలు చేపట్టి ప్రజలకు చేరువ కావాలని ఆదేశాలిచ్చారన్నారు గౌతమ్‌ సవాంగ్. ఏపీ పోలీస్‌శాఖను దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతామన్నారు.

గత పదేళ్ళలో ఏపీ పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారన్నారు. తన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తానన్నారు ఆయన. పోలీసుశాఖ సామాన్యులకు చేరువలో ఉంటుందని, మా కోసమే పోలీస్‌శాఖ ఉందని ప్రజలు అనుకునేలా పనిచేస్తామన్నారు. సేవాభావంతో కలిసి పనిచేస్తామన్నారు. శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తామని ఆయన అన్నారు.

డ్రగ్స్‌ కల్చర్‌, సైబర్‌ నేరాలపై దృష్టి పెట్టామని, పోలీసులకు ప్రత్యేకంగా శిక్షణ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక నుంచి పోలీసులకు వారాంతపు సెలవులను మంజూరు చేస్తామని చెప్పారు.

First Published:  1 Jun 2019 2:50 AM GMT
Next Story