Telugu Global
Cinema & Entertainment

మళ్లీ తన దారిలోకి వచ్చిన బెల్లంకొండ

సీత సినిమాలో స్వాతిముత్యం క్యారెక్టర్ చేశాడు బెల్లంకొండ. అది కాస్తా డిజాస్టర్ అయింది. దీంతో ఇలాంటి ప్రయోగాలు భవిష్యత్తులో చేయకూడదని నిర్ణయించుకున్నాడు ఈ హీరో. ఇప్పుడు మళ్లీ తనదారిలోకి వచ్చి, పక్కా మాస్ పోలీస్ గెటప్ లో రాక్షసుడు సినిమా చేశాడు. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజైంది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన రాట్ససన్ సినిమాకు రీమేక్ గా రాక్షకుడు తెరకెక్కింది. తమిళ సినిమాను యాజ్ ఇటీజ్ ఫాలో అయిపోయారనే విషయం టీజర్ […]

మళ్లీ తన దారిలోకి వచ్చిన బెల్లంకొండ
X

సీత సినిమాలో స్వాతిముత్యం క్యారెక్టర్ చేశాడు బెల్లంకొండ. అది కాస్తా డిజాస్టర్ అయింది. దీంతో ఇలాంటి ప్రయోగాలు భవిష్యత్తులో చేయకూడదని నిర్ణయించుకున్నాడు ఈ హీరో. ఇప్పుడు మళ్లీ తనదారిలోకి వచ్చి, పక్కా మాస్ పోలీస్ గెటప్ లో రాక్షసుడు సినిమా చేశాడు. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజైంది.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన రాట్ససన్ సినిమాకు రీమేక్ గా రాక్షకుడు తెరకెక్కింది. తమిళ సినిమాను యాజ్ ఇటీజ్ ఫాలో అయిపోయారనే విషయం టీజర్ చూస్తేనే అర్థమౌతోంది. అది నిజం కూడా. ఎలాంటి మార్పులు లేకుండానే రీమేక్ చేశామంటూ మేకర్స్ స్వయంగా ప్రకటించారు. ఇక టీజర్ విషయానికొస్తే, బెల్లంకొండ తన కెరీర్ లో మరోసారి పోలీస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. ఓ సైకో మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కిందనే విషయం టీజర్ లో కనిపిస్తోంది.

ఇందులో హీరో, హీరోయిన్ కంటే కంటెంట్, స్క్రీన్ ప్లేకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే టీజర్ లో హీరోయిన్ అనుపమ, హీరో బెల్లంకొండ కంటే నెరేషన్ ఎక్కువగా కనిపించింది. రమేష్ వర్మ డైరక్ట్ చేసిన ఈ రీమేక్ జులై 18న థియేటర్లలోకి రానుంది.

First Published:  1 Jun 2019 5:47 AM GMT
Next Story