Telugu Global
Health & Life Style

చేమ దుంపలు.... ఎన్నో పోషక నిల్వలు....

శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలంటే అన్ని రకాల కూరగాయలు తినాల్సిందే. కొంత మంది కొన్ని రకాలు కూరలకే తమ ఆహారాన్ని పరిమితం చేసుకుంటారు. కానీ అన్ని రకాల కూరలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు, ప్రోటీన్లు అందుతాయి. తద్వారా మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ఈ రోజు మంచి రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే చేమ దుంపలలో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో తెల్సుకుందాం. మిగతా కూరగాయలతో పోలిస్తే చేమదుంపలలో కొలెస్ట్ర్రాల్ చాలా […]

చేమ దుంపలు.... ఎన్నో పోషక నిల్వలు....
X

శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలంటే అన్ని రకాల కూరగాయలు తినాల్సిందే. కొంత మంది కొన్ని రకాలు కూరలకే తమ ఆహారాన్ని పరిమితం చేసుకుంటారు. కానీ అన్ని రకాల కూరలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు, ప్రోటీన్లు అందుతాయి. తద్వారా మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ఈ రోజు మంచి రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే చేమ దుంపలలో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో తెల్సుకుందాం.

  • మిగతా కూరగాయలతో పోలిస్తే చేమదుంపలలో కొలెస్ట్ర్రాల్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అందుచేత గుండె సమస్యలు దరిచేరే అవకాశాలు లేవు.
  • శరీరంలో వ్యర్దాలను బయటకి పంపడంలో చేమదుంపలు చాలా చురుకుగా పనిచేస్తాయి. మలబద్దకం ఉన్న వారికి చేమదుంపలు మంచి ఆహారం.
  • చేమదుంప రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న చేమదుంపలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.
  • రక్తప్రసారం సజావుగా సాగేందుకు చేమదుంపలు ఎంతో దోహదపడతాయి.
  • చేమదుంపలలో కొవ్వు శాతం అతి తక్కువగా ఉన్నందువల్ల శరీరం బరువు పెరగదు. డైట్ లో ఉన్న వారు చేమదుంపలు ఎక్కువగా తిన్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని న్యూట్రీషియన్స్ అంటున్నారు.
  • డయాబెటీస్ వ్యాధి ఉన్న వారికి చేమదుంపలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. రక్తంలో ఉన్నగ్లూకోజ్ స్దాయిలను అదుపు చేస్తుంది.
  • చేమదుంపలలో ఒమేగా టు ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ శాతం ఉన్నాయి. వీటిలో పోషకాలు కూడా ఎక్కువే. ఎదిగే పిల్లలకి చేమదుంపలు ఎంతో మేలు చేస్తాయి.
  • ఇందులో పోటాషియం శాతం కూడా అధికంగానే ఉంటుంది. లో-బిపీ తో బాధపడతున్న వారు చేమదుంపలు తింటే మంచి ఫలితం ఉంటుంది.
  • ఇంకా చేమదుంపలలో న్యూట్రియంట్స్, పీచు పదార్దాలు కూడా ఉన్నాయి.
First Published:  31 May 2019 7:02 PM GMT
Next Story