Telugu Global
Cinema & Entertainment

మరొక సరికొత్త జోనర్ లో హరనాథ్

నటుడు మరియు ఫిలిం మేకర్ అయిన హరనాథ్ పొలిచర్ల రొటీన్ కథలను కాకుండా సరికొత్త మరియు విభిన్న జోనర్లకు సంబంధించిన సినిమాలను తెరకెక్కించడంలో పేరున్న ఫిల్మ్ మేకర్. చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చిన హరనాథ్ పొలిచర్ల ఇప్పుడు ‘కెప్టెన్ రాణా ప్రతాప్’ అనే టైటిల్ తో ఒక సినిమా చేయబోతున్నారు. ‘ఎ జవాన్స్ స్టోరీ’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల […]

మరొక సరికొత్త జోనర్ లో హరనాథ్
X

నటుడు మరియు ఫిలిం మేకర్ అయిన హరనాథ్ పొలిచర్ల రొటీన్ కథలను కాకుండా సరికొత్త మరియు విభిన్న జోనర్లకు సంబంధించిన సినిమాలను తెరకెక్కించడంలో పేరున్న ఫిల్మ్ మేకర్.

చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చిన హరనాథ్ పొలిచర్ల ఇప్పుడు ‘కెప్టెన్ రాణా ప్రతాప్’ అనే టైటిల్ తో ఒక సినిమా చేయబోతున్నారు. ‘ఎ జవాన్స్ స్టోరీ’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. టైటిల్ కి తగ్గట్టు గానే ఈ సినిమా మిల్ట్రీ బ్యాక్ డ్రాప్ తో నడుస్తుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో హరనాథ్ పొలిచర్ల ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయని సమాచారం. చిత్ర బృందం ఈ సినిమాని త్వరగా పూర్తిచేసి జూన్ లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

డ్రీమ్ టీం బ్యానర్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుమన్, పునీత్ ఇస్సార్ మరికొందరు పాప్యులర్ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

First Published:  1 Jun 2019 12:25 AM GMT
Next Story